హైద్రాబాద్, నవంబర్ 30, (way2newstv.in)
చలికాలంలో దాని తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడడం సర్వసాధారణం. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పును దేహం స్వీకరించే స్థితిలో ఉండదు. ఈ క్రమంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాస నాళాలు మూసుకుపోయి, చెవి, గొంతు వంటి ఆరోగ్య సంబంధ సమస్యలతో పాటు ఇన్‌ఫెక్షన్లు రెట్టింపవుతుంటాయి. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు త్వరగా ఫ్లూ భారిన పడే ప్రమాదముంది. ప్రస్తుత వాతావరణం ‘హెచ్1ఎన్1’ స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌కు అనుకూలంగా ఉండడంతో అది మరింత విజృంభించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సిటీలో చలితో వణుకు......
ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది టూ వీలర్‌పైనే ప్రయాణిస్తుంటారు. ఉదయం చలితో పాటు దట్టమైన పొగమంచు ఉంటుంది. ఈ కాలంలో ఉదయం విధులకు వెళ్లేవారు కాళ్లు, చేతులు, ముఖానికి చలిగాలులు తాకడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడతాయి. దురద పుట్టి గోకినప్పుడు పగుళ్లు పుండ్లుగా మారే ప్రమాదం ఉంది. జుట్టు రాలిపోవడంతో పాటు చుండ్రు సమస్య తలెత్తవచ్చు. ఇప్పటికే సోరియాసిస్ వంటి చర్మ రోగాలతో బాధపడుతున్న వారు ఈ సీజన్‌లో మరింత ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో శరీరంలో ‘కార్టిసో’ హార్మోన్ ఉత్పత్తి అయ్యి రక్త నాళాల సైజు తగ్గి, బ్లడ్ క్లాట్‌కు కారణమవుతుంది. రాత్రి వేళ శరీరానికి మాయశ్చర్ క్రీములు రాసుకోవడం ద్వారా చర్మ పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో పెదాలు తరచూ ఆరిపోతుంటాయి. ఉపశమనం కోసం ఉమ్మితో తడుపుతూ చిగుళ్లను పంటితో కొరుకుతుంటారు. దాంతో చర్మం చిట్లిపోయి రక్తం కారుతుంది. ఇలా చేయకుండా పెదాలకు లిప్‌గార్డ్ వంటివి రుద్దడం ద్వారా కాపాడుకోవచ్చు. ఈ సీజన్‌లో నీరు సమృద్ధిగా తాగాలి. లేదంటే బాడీలో నీటి శాతం తగ్గి స్కిన్‌గ్లో తగ్గిపోతుంది. సోరియాసిస్ బాధితులు స్నానానికి ముందు ఒంటికి ఆయిల్ అప్లయ్ చేసుకోవాలి. చల్లటి నీరు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. పిల్లలకు కాళ్లు, చేతులు బయటికి కనిపించకుండా ఉన్ని దుస్తులు వేయాలి. సాధ్యమైనంత వరకు హృద్రోగ బాధితులు చలిలో తిరగక పోవడమే ఉత్తమమమని డాక్టర్లు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment