Breaking News

29/11/2019

అలీ రెజాకు కృష్ణవంశీ బంపర్ ఆఫర్

హైద్రాబాద్, నవంబర్ 29 (way2newstv.in)
సిక్స్ ప్యాక్ బాడీతో నాగార్జునతోనే బిగ్ బాస్ సీజన్ 3 గ్రీకువీరుడు అనిపించుకున్న కంటెస్టెంట్ అలీ రెజా బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ అప్ కమింగ్ మూవీ ‘రంగమార్తాండ’లో కీలకపాత్రలో కనిపంచబోతున్నాడు అలీ రెజా.లాంగ్ గ్యాప్ తరువాత ‘నట సామ్రాట్’ అనే మరాఠా చిత్రాన్ని కృష్ణవంశీ ‘రంగమార్తాండ’గా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. సుమారు 15 ఏళ్ల తరువాత భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేస్తుంది రమ్యకృష్ణ. 
అలీ రెజాకు కృష్ణవంశీ బంపర్ ఆఫర్

2004లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన శ్రీఆంజనేయంలో కీలకపాత్రలో నటించిన రమ్యక్రిష్ణ 15 ఏళ్ల తరువాత భర్త డైరెక్షన్‌లో హీరోయిన్‌గా చేయడం విశేషం.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలకపాత్రను దక్కించుకున్నాడు అలీ రెజా. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు అలీ రెజా. క్రిష్ణవంశీకి ప్రస్తుతం హిట్లు లేకపోయినప్పటికీ ఆయన దగ్గర చిన్న హీరోలుగా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్లు.. నేడు స్టార్ హీరోలుగా ఉన్నారు. మరి బుల్లితెర బుల్ డోజర్ అనిపించుకున్న అలీ రెజా లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

No comments:

Post a Comment