హైద్రాబాద్, నవంబర్ 29 (way2newstv.in)
నియర్ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజశేఖర్ లైసెన్స్ రద్దు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఆర్టీఏకి లేఖ కూడా రాశారట. దీంతో మరి కొద్ది రోజులలోనే ఆయన లైసెన్స్ రద్దు కానుంది. ట్రాఫిక్ చట్టాలని రెండు మూడు సార్లు ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని జనాలు చెబుతున్నారు.2017 అక్టోబర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వలననే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. తల్లి చనిపోయిందనే డిప్రెషన్‌లో నిద్రమాత్రలు వేసుకోవడం వలన ఆ మత్తులో కారు యాక్సిడెంట్ చేశాడని అన్నారు. గరుడవేగ చిత్ర రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే ఈ యాక్సిడెంట్ జరిగిందిఇక రీసెంట్‌గా శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్‌పై నటుడు రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. సమయానికి బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయన పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. రాజశేఖర్ కారు డివైడర్‌ని ఢీకొట్టి అవతలి వైపుకి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లగా, ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.
No comments:
Post a Comment