Breaking News

20/11/2019

గ్రామస్థాయికి సమాచార సాంకేతిక వ్యవస్థ

సమీక్షా భేటీలో సీఎం జగన్ మోహన్
అమరావతి నవంబర్ 20, (way2newstv.in):
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించండని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు  ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో అయన పాల్గోన్నారు. సీఎం మాట్లాడుతూ గ్రామ, వార్డు సెక్రటేరియట్లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది  చాలా ముఖ్యం. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలని అన్నారు. 
గ్రామస్థాయికి సమాచార సాంకేతిక వ్యవస్థ

రేషన్ కార్డు, పెన్షన్కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్ మెంట్కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయి. ఈ కార్డులు అక్కడే ప్రింట్ అయి లబ్ధిదారులకు అందాలంటే.. వ్యవస్థ అంతా సక్రమంగా, పటిష్టంగా ఉండాలి. విశాఖపట్నం,  తిరుపతి, బెంగుళూరుకు సమీపంలో ఉన్న అనంతపురం ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై ఆలోచనలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాథమికంగా ఒక్కో సిటీ 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటుపై ప్రణాళికలు తయారుచేయండని అయన సూచించారు. గత ప్రభుత్వ ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లు రూ.4వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. అలాంటిది చంద్రబాబు పరిశ్రమల గురించి, ఇండస్ట్రీస్ ప్రమోషన్స్ గురించి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడ్డం విడ్డూరమని అన్నారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరుచేయడంతోపాటు, పారదర్శక విధానాలను, అవినీతి రహిత సింగిల్ విండో పద్దతిని అందుబాటులోకి తీసుకు వచ్చాం. వచ్చే కంపెనీలకు ప్రోత్సాహక ధరలతో భూములు, నీరు, కరెంటు లాంటి సదుపాయాలను కల్పిస్తామని అన్నారు.

No comments:

Post a Comment