Breaking News

20/11/2019

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు

పెద్దపల్లి నవంబర్ 20, (way2newstv.in):
సుల్తానాబాద్ ఎంపిడిఒ  కార్యాలయంలో 9 మందికి  ప్రభుత్వ విప్ టి.భానుప్రసాద్ రావు  సీఎంఆర్ఎఫ్  చెక్కులను పంపిణీ చేసారు.  బుధవారం నాడు  పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో  ముఖ్యమంత్రి సహాయునిధి నుండి మంజూరైన   రూ. 2 లక్షల 95 వేల 500  విలువైన 9 చెక్కులను పంపిణీ చేసారు.  
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ  చేసిన  ప్రభుత్వ  విప్ భానుప్రసాద్ రావు

జే.లక్ష్మణ్( రూ.69000) , కె.చైతన్య (రూ.12,000) , జి.ప్రమోద(రూ.26,000), ఎం.సంపత్(రూ.22,000), డి.సాగర్  రావు(రూ.52500) డి.సరిత(రూ.17,500) , బి.రాజయ్య(రూ.60,000),  బి.వరలక్ష్మీ( రూ.20500),  జీ.నరేష్( రూ.16000) చెక్కులను అందజేసారు.  ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని, అందరి సంక్షేమ ధ్యేయంగా  ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని  ప్రభుత్వ విప్ అన్నారు. ఎంపిడిఒ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

No comments:

Post a Comment