Breaking News

24/10/2019

దీపావళికి ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.

హైద్రాబాద్, అక్టోబరు 24 (way2newstv.in)
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న మరో వివాదాస్పద చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఆంధ్రప్రదేశ్‌కు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో వర్మ ఈ సినిమాను ప్రకటించారు. వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదాస్పదం కాని సినిమా ఇదంటూ ఇప్పటికే వర్మ ప్రచారం చేశారు. రెండు నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లుక్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఆ లుక్ బాగా వైరల్ అయ్యింది.అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు వర్మ. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.
దీపావళికి ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.

అక్టోబర్ 27న ఉదయం 9.36 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ కూడా వదిలారు. ఈ పోస్టర్‌లో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ పాత్రలు ఉన్నాయి. మొత్తం మీద దీపావళి రోజు వర్మ రచ్చ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ మరెన్ని వివాదాలకు తెరలేపుతుందో చూడాలి. వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదం కాని సినిమా అని చెబుతున్నా వర్మ అంత ఈజీగా వదుతులుతారని అనుకోకూడదు.లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కేసులు, కోర్టుల చుట్టూ ఈ సినిమా తిరిగింది. మొత్తానికి ఎన్నికలు అయిపోయిన తరవాత విడుదలైంది. ఈ సినిమాలో ప్రధానంగా చంద్రబాబు నాయుడిని విలన్‌గా చూపించారు వర్మ. మరి ఈ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఏం చూపించబోతున్నారో. ఈ సినిమాను అజయ్ మైసూర్ ప్రొడక్షన్, టైగర్ కంపెనీ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

No comments:

Post a Comment