Breaking News

25/10/2019

తమిళనాడులో రెచ్చిపోయిన విజయ్ ఫ్యాన్స్

చెన్నై, అక్టోబర్ 25 (way2newstv.in)
మిళనాడులో ‘బిజిల్’ మానియా మామూలుగా లేదు. ఈ సినిమా కోసం దళపతి విజయ్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూశారు. ‘తెరి’ (పోలీస్), ‘మెర్సల్’ (అదిరింది) వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరవాత విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికితోడు ‘బిజిల్’ ట్రైలర్‌ అద్భుతంగా ఉండటంతో ఆ అంచనాలు ఆకాశానికి అంటాయి. కనివినీ ఎరుగని రీతిలో ‘బిజిల్’కు క్రేజ్ ఏర్పడింది. ఇంత భారీ అంచనాల నడుమ ఈ చిత్రం దీపావళి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందితమిళనాడులో ‘బిజిల్’ ప్రత్యేక షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. 
తమిళనాడులో రెచ్చిపోయిన విజయ్ ఫ్యాన్స్

దీంతో తమిళనాడులోని చాలా చోట్ల గురువారం అర్ధరాత్రి నుంచే షోలు ప్రారంభమైపోయాయి. అయితే, జిల్లా కేంద్రం కృష్ణగిరిలో మిడ్‌నైట్ షో వేయలేదు. దీంతో ఆగ్రహించిన అభిమానులు తమకు మిడ్‌నైట్ షో వేయాలని డిమాండ్ చేశారు. థియేటర్ యాజమాన్యం కుదరదని చెప్పడంతో రెచ్చిపోయారథియేటర్‌ను ధ్వంసం చేశారు. సినిమా హాల్ సమీపంలో ఉన్న కూడలి వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. రోడ్డుపై నిప్పు కూడా పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి విజయ్ అభిమానులపై లాఠీఛార్జి చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన అభిమానులు పోలీసులు, మున్సిపాలిటీ వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ‘బిజిల్’ ప్రత్యేక షో వేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. వారిని చెదరగొట్టిన పోలీసులు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కృష్ణగిరిలోని కూడలి వద్ద విజయ్ అభిమానులు విధ్వంసం సృష్టిస్తోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంత తమ మొబైళ్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. హీరోలపై పిచ్చి అభిమానంతో ఇలా ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడమేంటని కొంత మంది మండిపడుతున్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా టుంటే, ‘బిజిల్’ సినిమాపై ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా చాలా బాగుందని కొంత మంది.. డిజాస్టర్ అని మరికొంత మంది అంటున్నారు.

No comments:

Post a Comment