Breaking News

26/10/2019

ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదు

గుంటూరుఅక్టోబరు 26, (way2newstv.in)
రాష్ట్రంలో  గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఏ కాలానికైనా గాంధీ సిద్ధాంతాలు ఆచరనీయంప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేదని బీజేపీ ఎంపి సుజనా చౌదరి అన్నారు. శనివారం అయన గుంటూరు లో మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. తెలుగు రాష్టాల్లో  బిజేపి ఏ పార్టీ తోను పొత్తు పెట్టుకోదు. రాజధానిపై ప్రజలలో గందరగోళం ఉన్న మాట వాస్తవమే. 
ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదు

ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ముఖ్యమంత్రి  జగన్ దీనిపై స్పందించాలి. రాజధానిపై జాతీయ పార్టీగా ఇప్పుడే ఏమీ స్పందించామని అయన అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో బిజెపి నాయకులు మాజీమంత్రి శనక్కాయల అరుణ,  చందు సాంబశివరావు, టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు,  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీపతి రమాకుమారి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment