Breaking News

29/10/2019

అక్టోబర్ 31 లోపు సామూహిక మరుగుదొడ్లలో అదనపు సదుపాయాలు పూర్తి చేయాలి

జిల్లా  కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి  , అక్టోబర్ 29(way2newstv.in)
 జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లలో అక్టోబర్ 31,2019 లోగా కనీస సదుపాయాల కల్పన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు.  సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పై సంబంధిత అధికారులతో  కలెక్టర్ మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ  గ్రామాలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు  దివ్యాంగులకు సైతం ఉపయోగకరంగా ఉండే విధంగా  ప్రతి సామూహిక మరుగుదొడ్డి వద్ద ర్యాంపులను వెంటనే  ఎర్పాటు చేయాలని ,  ప్రతి సామూహిక మరుగుదొడ్డి వద్ద  నీటి సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సామూహిక మరుగుదొడ్డికి రంగులు వేయాలని, మిగిలిన చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 
అక్టోబర్ 31 లోపు సామూహిక మరుగుదొడ్లలో  అదనపు  సదుపాయాలు పూర్తి చేయాలి

సామూహిక మరుగుదొడ్ల పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ మండలాలకు  ప్రత్యేక అధికారులను నియమించారు. మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులు మండలంలోని గ్రామాలలో అక్టోబర్ 31న పర్యటించి  సామూహిక మరుగుదొడ్లు కి సంబంధించి క్షేత్ర స్థాయి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జూలపల్లి మండలానికి జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి, తెలియడం మండలానికి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాజా వీరు, ముత్తారం మండలం కి జడ్పీ సీఈవో వినోద్ కుమార్, మంతిని మండలానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కమాన్పూర్ మండలానికి ఏడి మైనింగ్, ఓదెల మండలానికి ఏకే, సుల్తానాబాద్ మండలానికి ఏడి పశుసంవర్ధక శాఖ, ధర్మారం మండలానికి జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్,రామగిరి మండలానికి డివిజనల్ పంచాయతీ అధికారి మంథని రాంబాబు, పెద్దపల్లి మండలానికి డివిజనల్ పంచాయతీ అధికారి దేవకీదేవి, శ్రీరాంపూర్ మండలం నికి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్,పాలకుర్తి మండలానికి జిల్లా హార్టికల్చర్ అధికారి జ్యోతి లను కలెక్టర్ నియమించారు. జడ్పీ సీఈవో వినోద్ కుమార్ , ఈ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ఇ జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment