Breaking News

10/10/2019

అమరావతి నిర్మాణం ఆపేసి ఏం సాధించారు?

రాజధాని తరలింపు, సచివాలయమార్పు వంటివాటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
విజయవాడ అక్టోబర్ 10 (way2newstv.in)
రాష్ట్ర విభజనతర్వాత బస్సుల్లో ఉండి పాలనసాగించిన నాటిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అమరావతిపేరుతో  సాంస్కృతిక, చారిత్రకప్రదేశమైన ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి ఎంపికచేశారని టీడీపీ అధికారప్రతినిధి, మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. కృష్ణానదీ పరీవాహకప్రాంతంలోనిరైతాంగాన్ని ఒప్పించి, 34వేల ఎకరాలను సేకరించి,   13 జిల్లాలకు కేంద్రబిందువుగా ఉండేలా, సింగపూర్ ప్రభుత్వ డిజైన్లతో అమరావతి నిర్మాణాన్ని చేపడితే, వైసీపీ ప్రభుత్వంవచ్చాక,రాజధాని ప్రాంతంలో అన్ని పనులను నిలిపేసిందన్నారు. 
అమరావతి నిర్మాణం ఆపేసి ఏం సాధించారు?

గురువారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులతో కలిసి విలేకరులతోమాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం సెల్ఫ్ఫైనాన్స్ ప్రాజెక్ట్గా రాజధాని నిర్మాణాన్ని ప్రారంభిస్తే, నిధులలేమితో వైసీపీ ప్రభుత్వం దాన్ని అటకెక్కించడం అన్యాయమన్నారు. గతకొన్నిరోజులుగా రాజధానిని తరలిస్తున్నారని సచివాలయాన్ని తాడేపల్లికి తరలిస్తున్నారనే పుకార్లపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడంలేదని డొక్కా ప్రశ్నించారు. ఎవరిప్రయోజనాలకోసం, ఎవరికి మేలుచేయడం కోసం 5కోట్ల ఆంధ్రుల కలలను నాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నా రు. ఆంధ్రులకు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు  వంటి రాజధాని ఉండటం తప్పెలా అవుతుందని, ప్రభుత్వం ఈదిశగా ఎందుకు ఆలోచనచేయడంలేదని మాజీమంత్రి ప్రశ్నిం చారు. అమరావతి పూర్తయితే దేశవిదేశాలనుంచి పెట్టుబడులు వచ్చే అవకాశము న్నా, పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటుచేసే పరిస్థితులున్నా, రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు నిలిపేసిందో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ సర్కారు నిర్ణయాలతో హైదరాబాద్లో రియల్ఎస్టేట్ రంగం పుంజుకుందని, అక్కడి భూములధరలు రెట్టింపయ్యా యని, అమరావతిప్రాంతంలో భూములు, ఇళ్లధరలు దారుణంగా పడిపోయాయనిడొక్కా పేర్కొన్నారు. రాజధాని ప్రాంతమంటే కేవలం ఆప్రాంత రైతాంగం మాత్రమే నష్టపోవడం లేదని, అక్కడ నివసించే ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాల ఆశలు, ఆకాంక్షలకు గండికొట్టేలా ఏపీప్రభుత్వ తీరుఉందన్నారు.రాజధానిపై రోజుకోరకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంవైపు కన్నెత్తిచూడని పరిస్థితులు ఏర్పడ్డాయని,  రాష్ట్రం ఇమేజ్జాతీయస్థాయిలో డ్యామేజ్ అయిందని డొక్కా చెప్పారు. ప్రజావేదిక కూల్చివేతద్వారా  జగన్ ప్రభుత్వం ఒకతప్పుడు సందేశాన్నిచ్చిందన్న ఆయన, అలాంటిచర్యలతో వైసీపీ ప్రభుత్వందూకుడుగా వ్యవహరిస్తోందనే అపఖ్యాతిని మూటగట్టుకుందన్నారు.

No comments:

Post a Comment