Breaking News

16/10/2019

జర్నలిస్టు హత్యను ఖండించిన చంద్రబాబు

అమరావతి అక్టోబరు 16, (way2newstv.in)
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల పాత్రికేయుడు కాతా సత్యనారాయణ హత్యను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనకు ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ముందే కోరినా, చర్యలు తీసుకోక పోవడాన్ని గర్హించారు.  
జర్నలిస్టు హత్యను ఖండించిన చంద్రబాబు

జర్నలిస్ట్ లపై 4నెలలుగా దాడులు పెరగడం పట్ల చంద్రబాబు ఆందోళన ప్రకటించారు.  నెల్లూరులో జమీన్ రైతు సంపాదకుడిపై, మైనారిటీ వర్గానికి చెందిన జర్నలిస్ట్ పై, చీరాలలో మరో జర్నలిస్ట్ పై దాడులకు పాల్పడటాన్ని ప్రస్తావించారు.  తొండంగిలో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనంగా పేర్కొన్నారు.  నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment