Breaking News

24/10/2019

ఓటర్లకు ధన్యవాదాలు

హైదరాబాద్,  అక్టోబరు 24 (way2newstv.in)
అధికార పార్టీ అభ్యర్ధి ని గెలిపినందుకు హుజూర్ నగర్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో అయన స్పందించారు. మంత్రి మాట్లాడుతూ  తెలంగాణ సమాజం ఎప్పుడూ కేసీఆర్ వెంటే. 
ఓటర్లకు ధన్యవాదాలు

ఈ విషయం పదే పదే రుజువవుతున్నా విపక్షాలు తమ వికృతచేష్టలు మానుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద అబద్దాలు ప్రచారం చేసి ప్రజల దృష్టి మరల్చి లాభపడాలనుకున్న వారి ప్రయత్నాలకు ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ది చెబుతున్నారు.  అయినా అవే స్థాయి మరచిన విమర్శలు, అవే వక్రభాష్యాలు, అవే సంస్కారహీన చర్యలకు పాల్పడుతున్నారు.  ఇప్పటి వరకు పాఠం నేర్చుకోని నాయకులు .. ఇప్పుడు కూడా వారు పాఠం నేర్చుకుంటారని అనుకోవడం లేదని అయన అన్నారు.

No comments:

Post a Comment