Breaking News

16/10/2019

ఆలయాల్లో అవినీతిపై చిరు 152 మూవీ

హైద్రాబాద్, అక్టోబరు 16 (way2newstv.in)
కమర్షియల్ హంగులతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాల అనతికాలంలో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించారు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. 
ఆలయాల్లో అవినీతిపై చిరు 152 మూవీ

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే, చిరంజీవితో తొలిసారి పనిచేస్తోన్న కొరటాల శివ ఎలాంటి కథను ఎంపిక చేసుకున్నారు అనే చర్చ ప్రస్తుతం సినీ పరిశ్రమలో మొదలైంది. ఈ చర్చలో భాగంగానే కథకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమా అట. ఈసారి శివ ‘ఆలయాలపై నిర్లక్ష్యం, వాటి వెనుక జరుగుతోన్న అవినీతి’ అనే కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకున్నారని టాక్.

No comments:

Post a Comment