Breaking News

09/10/2019

మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన 100 మంది గ్రామస్తులు

వనపర్తి అక్టోబరు 9 (way2newstv.in)
తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న అనేక సంక్షేమ పథకాల ఆకర్షితులై తెలంగాణ పార్టీలో వందల సంఖ్యలో చేరుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 
 మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన 100 మంది గ్రామస్తులు

బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో అమ్మ పల్లి గ్రామానికి చెందిన వందమంది గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రిని వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలో గ్రామస్తులు చేరడం హర్షించదగ్గ విషయమని, అందుకు ప్రధాన కారణం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని మంత్రి అన్నారు.

No comments:

Post a Comment