Breaking News

10/09/2019

ములుగు జిల్లా లోని గ్రామాలు రాష్టానికి ఆదర్శంగా నిలవాలి

ములుగు కలెక్టర్ సి.నారాయణరెడ్డి
ములుగు సెప్టెంబర్ 10, (way2newstv.in)
గ్రామాల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి పదం అని,  ములుగు జిల్లా లోని గ్రామాలు రాష్ట్రానికి ఆదర్శంగా  నిలవాలని, శారీరక శ్రమ తోనే సంపూర్ణ ఆరోగ్యంని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డిఅన్నారు.   గుడుంబా బెల్టుషాపులు లేని గ్రామాలుగా కలిసికట్టుగా తీర్చిదిద్దుతాం అన్నారు.       తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం తోజిల్లాలోని అన్ని గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు.పల్లె ప్రగతి పథం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు గోవిందరావుపేట మండలం మచ్చ పురం గ్రామంలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్ పి సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తోకలిసి ములుగు జిల్లా కేంద్రం నుంచి మచ్చ పురం  వరకు సుమారు పదిహేను కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణం చేసి గ్రామానికి చేరుకున్నారు.
ములుగు జిల్లా లోని గ్రామాలు రాష్టానికి ఆదర్శంగా నిలవాలి

మచ్చ పురం గ్రామస్తులు కలెక్టర్కు ఎదురు వెళ్లి సాదరంగాఆహ్వానించారు. అనంతరం కలెక్టర్ ఎస్పీలు గ్రామంలో గ్రామస్తులతో కలిసి శ్రమదానం నిర్వహించి గ్రామంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు. అనంతరం ప్రజలు తమ సమస్యలనుకలెక్టర్కు విన్నవించగా ఎన్నో ఏళ్లుగా 1881 నుంచి 1890 సర్వే నెంబరు గల  సాగు భూములలో భూ సమస్యలతో పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకురాగాస్పందించిన కలెక్టర్ సంబంధిత పంటపొలాల వద్దకు స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు. పట్టాలు అందించక పోవడానికి గల కారణాలను, అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలుసలహాలు అందించారు.30 రోజుల కార్యక్రమం నిర్వహించడం తో పాటు మూడు రోజులలో గ్రామస్తులతో ప్రత్యేకసమావేశం నిర్వహించి భూ సమస్యలన్నింటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామంలోకాకతీయుల కాలమునాటి శివాలయాన్ని  పునర్నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరగా ఊరు శుభ్ర పరిచిన తర్వాత గుడి నిర్మాణాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీకార్యాలయానికి చేరుకొని ఎస్పి తో కలిసి అల్పాహారం పూజించారు. ప్రజల సమస్యలను వినతి ల రూపంలో స్వీకరించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామానికి చెందిన మేకలఅనే మహిళ డబల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని కలెక్టర్ను వేడుకొనగా స్పందించిన కలెక్టర్ తక్షణ సహాయం కింద 35 వేల రూపాయలను మంజూరు చేశారు.  గ్రామస్తులంతా ఇదే స్ఫూర్తితో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు సహకరించాలని కోరారు.

No comments:

Post a Comment