అనంతపురం, సెప్టెంబర్ 25, (way2newstv.in)
రాజకీయాలు చేయడం కన్నా.. వ్యవసాయం చేసుకోవడమే మేలు!“ అని ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డికి ఇప్పుడు ఇదే పరి స్థితి ఎదురైందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న ఆయన వైఎస్ హయాంలో వ్యవసాయ మంత్రిగా తనదైన శైలిలో చక్రం తిప్పారు. మేఘమథనం అనే కొత్త కార్యక్రమాన్ని తెరమీదికి తెచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఎటూ తేల్చకపోయినా.. తటస్థంగా వ్యవహరించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి రఘువీరారెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
రఘవీరారెడ్డికు కండువా మార్చేస్తారా
రఘువీరారెడ్డి పలు మార్లు విజయం సాధించారు. ఏపీ కాంగ్రెస్‌లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. తర్వాత ఈ నియోజకవర్గం రిజర్వ్‌డ్ కావడంతో తన రాజకీయాలను కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి మార్చుకు న్నారు. 2009లోఇక్కడి నుంచి రఘువీరారెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రిగా ప్రమోషన్ సాధించారు. ఇక, రాష్ట్ర విభజన నేపథ్యంలో రఘువీరారెడ్డి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. రెండు ఎన్నికలను తన హయాంలో ఎదుర్కొన్నారు. అత్యంత కీలకమైన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టారు. అయితే, ఆ తర్వాత పుంజుకునే ప్రయత్నాలు చేసినా.. రఘువీరారెడ్డి సక్సెస్ కాలేక పోయారనే మాట వాస్తవం.తాజాగా జరిగిన ఎన్నికల సమయంలోనూ రఘువీరారెడ్డి కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే, ఆయన వ్యూహాలు ఏమాత్రం కూడా ఫలించలేక పోయాయి. ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేస్తారు. కానీ, రఘువీరారెడ్డి మాత్రం.. అధికారంలో లేని వైసీపీనే తమకు ప్రధమ శత్రువని ప్రకటించడం భారీ మైనస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ కాంగ్రెస్‌తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడాన్ని కూడా ఏపీ ప్రజలు హర్షించలేకపోయారు.అయితే, ఏపీలో కాంగ్రెస్ టీడీపీలు విడివిడిగానే పోటీ చేసినా.. టీడీపీని టార్గెట్ చేయడం మానేసిన రఘువీరారెడ్డి కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడి పోతున్నా.. పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు. మొత్తంగా మరోసారి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం గుళ్లు గోపురాలకే పరిమితమయ్యారు రఘువీరారెడ్డి. కొన్నాళ్ల కిందటే పీసీసీ పదవిని స్వచ్ఛందంగా వదులుకున్న ఆయన రాజకీయాల్లోకి వచ్చినా.. ప్రభావం చూపించగలిగేంత సీన్ లేదని అంటున్నారు పరిశీలకులు. ఇక ఆయన పార్టీ మారినా.. మారవచ్చన్న టాక్ కూడా వస్తోంది. మరి రఘువీరారెడ్డి ? ఏం చేస్తారో ? చూడాలి.
No comments:
Post a Comment