Breaking News

16/09/2019

అంతర్జాతీయ ప్రమాణలతో తిరుపతి స్టేషన్

తిరుపతి సెప్టెంబర్ 16, (way2newstv.in)
తిరుమలకు విచ్చేసే భక్తులకు, ఇతర ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఇండియన్ రైల్వేస్ తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఇందులో భాగంగా స్టేషన్ పరిధిలో బడ్జెట్ హోటల్స్, మల్టీప్లెక్సెస్ వంటి వాటిని నిర్మిస్తారు. బడ్జెట్ హోటల్స్ ద్వారా ప్రయాణికులకు అందుబాటు ధరలోనే సులభంగా వసతి లభిస్తుంది.2023 నాటికి తిరుపతి రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణమైన స్టేషన్‌గా మారనుంది. రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేసుకుంటుంది. ఎస్‌సీఆర్ జోన్ ఇప్పటికే అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది.తిరుపతి రైల్వే స్టేషన్‌కు రోజుకు ఏకంగా దాదాపు లక్ష మంది ప్యాసింజర్లు, పర్యాటకులు వస్తున్నారు. 
అంతర్జాతీయ ప్రమాణలతో తిరుపతి స్టేషన్

స్టేషన్‌లో 5 ప్లాట్‌ఫామ్స్, 13 రన్నింగ్ ట్రైన్ లైన్స్ ఉన్నాయి. రానున్న కాలంలో మరో మూడు కొత్త ప్లాట్‌ఫామ్స్ నిర్మించనున్నారు.తిరుపతి ఈస్ట్‌లోని దక్షిణ భాగంలోని టర్మినల్ బిల్డింగ్‌లో మల్టీప్లెక్స్ ఏర్పాటుకు కూడా సన్నహాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ బడ్జెట్ హోటల్ బ్లాక్ కూడా ఉండనుంది. అలాగే వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్టు, ప్యాసింజర్లు రావడానికి పోవడానికి ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్ లెవెల్స్ వంటి వాటిని కూడా నిర్మించనున్నారు. దీని కోసం టెండరింగ్ ప్రాసెస్ నడుస్తోంది. ఇకపోతే ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్‌లో కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి. తిరుపతికి వివిధ మార్గాల్లో భక్తులు తిరుపతికి చేరుకుంటారు.  ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి రైలు మార్గంలో తిరుపతికి చేరుకుంటారని తెలుసు.  ఇప్పటి వరకు తిరుపతి రైల్వే స్టేషన్లో మామూలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.  ఇకపై భక్తులకు అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలను కల్పించబోతున్నారు.  రోజుకు లక్షమందికి పైగా భక్తులు  ట్రైన్స్ లో తిరుపతికి వస్తున్నారు.  అక్కడ ఐదు ప్లాట్ ఫామ్ లు ఉండగా మరో మూడింటిని అదనంగా కడుతున్నారు. దీంతోపాటు,రైల్వే స్టేషన్లో బడ్జెట్ హోటల్స్ నిర్మాణం జరుగుతున్నది. ఇవి అందుబాటులోకి వస్తే.. తక్కువ ధరకే రైల్వే స్టేషన్లో వసతి దొరుకుతుంది.  బయట వేలాది రూపాయలు ఖర్చు చేసి హోటల్స్ లో ఉండాల్సిన అవసరం ఉండదు.  అలానే, మంచి భోజన సదుపాయం కూడా లభిస్తుంది.  దీంతో పాటు స్టేషన్లో మల్టీ ప్లెక్స్ ను కూడా నిర్మించబోతున్నారు.  దీనికి రైల్వే శాఖ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా అనుమతులు లభించాయి.  ఇలా అనుమతులు రావడంతో... తిరుపతి రైల్వే పనులను మమ్మురం చేసింది.

No comments:

Post a Comment