Breaking News

25/09/2019

మినిస్టర్ క్వార్టర్స్ అంటే భయమా...

దూరంగానే మంత్రులు
హైద్రాబాద్, సెప్టెంబర్ 25, (way2newstv.in)
సకల సౌకర్యాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన  మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉండేందుకు రాష్ట్ర మంత్రులు పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. విశాలమైన మైదానం, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సౌలతులు ఆ క్వార్టర్స్లో ఉంటాయి. భద్రత కోసం 24 గంటలపాటు సెక్యూరిటీ ఉంటుంది. అదే సమయంలో ఎవరెవరూ వస్తున్నారని తెలుసుకునేందుకు నిఘా సైతం ఉంటుంది. ఈ నిఘా కారణంగానే కొందరు మంత్రులు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉండేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో మినిస్టర్స్ క్వార్టర్స్  ఉన్నాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి వచ్చే విజిటర్స్ వివరాలను అక్కడి సిబ్బంది తీసుకున్నాకే లోపలికి అనుమతిస్తారు. మంత్రుల వద్దకు పార్టీ నేతలు, బంధువులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉండే సన్నిహితులు వచ్చి వెళ్తుంటారు. వారి వివరాలను అక్కడి ఇంటెలిజెన్స్ సిబ్బంది సేకరించి పైఅధికారులకు పంపుతుంటారు. 
మినిస్టర్ క్వార్టర్స్ అంటే భయమా...

ఇది కొంత మంది మినిస్టర్స్కు ఇబ్బందిగా మారింది. దీంతో సొంతింట్లోనే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇంకొందరు మంత్రులు.. క్వార్టర్స్ను క్యాంప్ ఆఫీసులుగా వాడుకుంటున్నారు.గత ప్రభుత్వంలో మినిస్టర్స్ క్వార్టర్స్లోని నిఘా వర్గాలు చేసిన కొన్ని పనులు మంత్రులకు చికాకు తెప్పించాయని టీఆర్ఎస్ లోని ఓ సీనియర్ నాయకుడు అన్నారు. మంత్రుల వద్దకు ఎవరెవరు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఎంతసేపు ఉంటున్నారు.. తదితర పూర్తి వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తుంటాయని, దీంతో అప్పట్లో మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉండే ఓ మంత్రి వద్దకు వెళ్లేందుకు నాయకులు భయపడి, మినిస్టర్స్ క్వార్టర్స్  ముఖం చూడటం మానేశారని గుర్తుచేశారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు.. మరోవైపు క్వార్టర్స్ వద్ద వేగులు ఉండటంతో క్వార్టర్స్ కంటే బయట ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి సదరు మంత్రి వచ్చారని  తెలిపారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మంత్రుల్లో కొందరు ఇప్పటికీ క్వార్టర్స్ కు వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియెట్కు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే మినిస్టర్స్ క్వార్టర్స్ ఉన్నా.. వాటిల్లో ఉండేందుకు వారు ఇష్టపడటం లేదు. తమ సొంతిల్లు సెక్రటేరియెట్కు సుమారు 30, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అక్కడి నుంచే వచ్చేందుకు ఇష్టపడుతున్నారు

No comments:

Post a Comment