Breaking News

25/09/2019

మళ్లీ పెరుగుతున్న పసిడి ధర

ముంబై, సెప్టెంబర్ 25  (way2newstv.in)
పసిడి ధర పెరుగుతూనే వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.20 పెరుగుదలతో రూ.39,400కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.20 పెరుగుదలతో రూ.36,120కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దాదాపు స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.50,070 వద్దనే నిలకడగా ఉంది. 
మళ్లీ పెరుగుతున్న పసిడి ధర

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. రూ.38,100 వద్దనే ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.36,900 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర స్థిరంగా రూ.50,070 వద్దనే ఉంది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర కిందకు దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గుదలతో 1,536.65 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం క్షీణతతో 18.57 డాలర్లకు తగ్గింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment