Breaking News

09/09/2019

ప్రజాకవి కాళోజీ స్పూర్తిప్రధాయులు

జిల్లా  జాయింట్ కలెక్టర్  వనజాదేవి
పెద్దపల్లి సెప్టెంబర్ 09  (way2newstv.in)
ప్రజాకవి కాళోజీ గారు స్పూర్తి ప్రధాయులని, వారి రచనలు అనేక మందిని చైతన్యం వైపు నడిపించాయని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి అన్నారు.   ప్రజాకవి, పద్మవిభూషణ్  కాళోజి 105వ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ఆయన చిత్రపట్టానికి జేసి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం జేసి మాట్లాడుతూ   ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ గారు అనేక రచనలు చేసారని, తెలంగాణ భాషను వ్యాప్తి చెందే విధంగా ఆయన రచనలు ఉండేవని జేసి గుర్తు చేసారు. 
ప్రజాకవి కాళోజీ స్పూర్తిప్రధాయులు

రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాళోజీ  గారి రచనలు ఎంతో దోహదపడ్డాయని, ఆయన స్పూర్తితో  ఆయన జన్మదినం నాడు  తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జేసి అన్నారు.   తెలంగాణ ప్రజల  ప్రతీ ఉద్యమం యొక్క  ప్రతిద్వనిగా కాళోజి గారిని  కొనియాడతారని, రాజకీయ చైతన్యాల సమాహారమని జేసి అన్నారు.  తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రజావాదిగా ఆయన గుర్తింపు సాధించుకున్నారని జేసి అన్నారు.   కాళోజీ పుట్టిక నీది, చావు నిది, బ్రతుకంతా దేశానిది అని  చెప్పిన  విధంగా ఆయన జీవనం  మొత్తం దాని పాటిస్తూ  తెలంగాణలో ప్రజల మధ్య చైతన్యం వ్యాప్తి చేందేలా కృషి చేసారని జేసి అన్నారు.  నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి , ఆరాచన పాలనకి వ్యతిరేకంగా  తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచారని,  దేశ స్వాతంత్ర్య  ఉద్యమంలో సైతం ఆయన భాగస్వాములని జేసి అన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమం చేసిన ఉద్యమకారుడు  కాళోజీ అని జేసి అన్నారు.  కాళోజీ గారు చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం  పద్మవిభూషణ్ అందించిందని,   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న వైద్య విద్యాలయానికి సైతం  కాళోజీ గారి పేరు పెట్టి ఆయనను గౌరవించడం జరిగిందని జేసి అన్నారు.జిల్లా పంచాయతి అధికారి వి.సుదర్శన్,  కలెక్టరేట్ సూపరిండెంట్ లు పాల్ సింగ్, కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు ఈ  కార్యక్రమంలో  పాల్గోన్నారు.

No comments:

Post a Comment