హైద్రాబాద్, సెప్టెంబర్ 10, (way2newstv.in)
2023 ఎన్నికల నాటికి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కమలదళం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కాంగ్రెస్, టీడీపీలతో పాటు అధికార టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు కీలక నేతలను లాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కీలక నాయకులను తీసుకుంది. ముందు ముందు కూడా మరికొందరిని తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తాజాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ కూడా బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది
పకడ్బందీ ప్రణాళికతో కమలం
ప్రస్తుతానికైతే.. ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. కాస్త తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. తాను బీజేపీలోకి వెళ్తే.. దేశ రాజకీయ చరిత్రలోనే రికార్డు సృష్టించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఆ మహిళా ఎంపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరని అనుకుంటున్నారా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కవిత 1.5 లక్షల భారీ మెజార్టీతో తిరుగులేని విజయం సాధించించారు. నిజానికి.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ చేతిలో ఓడిపోయారు. అయితే.. ఇదే సమయంలో డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెడ్యానాయక్ గెలిచారు. ఆ తర్వాత కూతరు కవితతో కలిసి రెడ్యానాయక్ అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గిరిజన లంబాడా మహిళ ఎంపీగా గెలవడం ఇదే మొదటిసారి. దీంతో ఆమె రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.అయితే.. ప్రస్తుతం బీజేలో కూడా గిరిజన నేతలెవరూ పెద్దగా లేరు. ఈ నేపథ్యంలో ఎంపీ కవితను పార్టీలోకి తీసుకునే ప్రయత్నంలో కమలం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆమె బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి వస్తే.. కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారట. ఒకవేళ.. కవిత బీజేపీలోకి వెళ్లి.. కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటే.. ఒక గిరిజన మహిళగా మరో చరిత్ర సృష్టించనుంది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఎంపీగా కవిత చరిత్రలో నిలుస్తారు.ఈ నేపథ్యంలోనే కవిత కూడా కాస్త ఆలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది. వెళ్లాలా.. వద్దా.. ? అని తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ మానుకోట జిల్లాలో కూడా బీజేపీ అంతో ఇంతో బలంగానే ఉంది. కవితకు కూడా వ్యక్తిగతంగా మంచిపట్టుంది. ఈ నేపథ్యంలో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలన్న ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఆయన తండ్రి సీనియర్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ సైతం కుమార్తెకు వచ్చిన ఆఫర్‌ను బట్టి కండువా మార్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment