Breaking News

06/09/2019

కారు..తకరారు...

ముసలం తప్పదా..
హైద్రాబాద్, సెప్టెంబర్ 6, (way2newstv.in)
ల్వకుంట్ల చంద్రశేఖర రావు తరువాత కారు స్టీరింగ్ తిప్పేది ఎవరు ? అనే చర్చ ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో బాగా పెరిగిపోయింది. దీనికి కారణం ఈటెల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారన్న ప్రచారం ఒకటి. హరీష్ రావు తో అత్యంత సన్నిహితంగా వుండే ఈటెల పై ఒక వ్యూహం ప్రకారం సాగుతున్న ఈ ప్రచారం తదనంతరం కెటిఆర్ చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశం గా మారాయి. పైకి కెటిఆర్ హరీష్ రావు ల నడుమ సఖ్యత బాగానే ఉందని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం పొగలు సెగలు రేగుతున్నాయన్నది గులాబీ శ్రేణుల టాక్.పదవులు వచ్చాక కొందరు చెలరేగిపోతున్నారని అలాంటి వారు గుర్తించాలిసింది పార్టీ ఉంటేనే తామున్నామని కెటిఆర్ జిహెచ్ఎంసి ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 
కారు..తకరారు...

ఈ వ్యాఖ్యలు ఈటెల, హరీష్ లను ఉద్ధేశించి మాత్రమే అని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఏ పార్టీకైనా ప్రజలే బాస్ లని అలాగే పదవులు పార్టీ ద్వారా వస్తాయని మర్చిపోకూడదని ఘాటు వ్యాఖ్యలే చేశారు.సిద్ధిపేట ఎమ్యెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన అభిమాని వెయ్యి కొబ్బరికాయలు కొట్టడం గులాబీ పార్టీ లో మరింత అలజడి రేకెత్తించింది. ఇందులో హరీష్ ప్రమేయం వున్నా లేకపోయినా కారు పార్టీలో పవర్ పాలిటిక్స్ ఏ స్థాయికి చేరుకున్నయో చెప్పక చెబుతున్నట్లు అయ్యింది. ఇప్పటికే గులాబీ పార్టీ కి వారసుడు కెటిఆర్ అన్నది అందరికి అర్ధం అయ్యేలాగే చర్యలు తీసుకున్నారు కెసిఆర్. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కట్టబెట్టి తనతదనంతరం కెటిఆర్ అనే సందేశం పంపారు గులాబీ బాస్. అయితే హరీష్ రావు, కెటిఆర్ లకు మంత్రి వర్గం లో రెండోసారి అధికారం చేపట్టాకా ఛాన్స్ ఇవ్వలేదు కెసిఅర్. కానీ కెటిఆర్ కు మాత్రం పార్టీ పగ్గాలు ఇచ్చి హరీష్ ను మాత్రం ఖాళీగా కూర్చోబెట్టడం తో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తుంది. హరీష్ వర్గం అదనుకోసం చూస్తుందని ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలంటున్నారు పరిశీలకులు.

No comments:

Post a Comment