Breaking News

07/09/2019

తెలుగు రాష్ట్రాల మధ్య లడాయిలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 7, (way2newstv.in)
కేసీఆర్ చాలా మంచివాడని నిండు అసెంబ్లీలో పొగిడిన వారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన దయ వల్ల ఏపీలో గోదావరి నీళ్ళు సీమ లాంటి దుర్భిక్షమైన ప్రాంతంలో పారే అవకాశం వుందని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉంటేనే అభివృధ్ధి సాధ్యమని కూడా జగన్ తరచుగా అన్న సంగతి విధితమే. కేసీఆర్ ను ఓ విధంగా జగన్ గాడ్ ఫాదర్ గా భావిస్తున్నారని కూడా అంతా అర్ధం చేసుకున్నారు. ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు కేసీఆర్, జగన్ ఇద్దరి దోస్తీ రహస్యంగా సాగిందంటారు. ఎందుకంటే ఉమ్మడి శత్రువు చంద్రబాబు ఉన్నారు కాబట్టి. 
తెలుగు రాష్ట్రాల మధ్య లడాయిలు

అలా రాజకీయంగా అనివార్యమైన స్నేహం చేశారని చెబుతారు. ఇక ఇద్దరినీ కలిపేందుకు ఉమ్మడి ఏపీ గవర్నర్ నరసింహన్ అప్పట్లో సిధ్ధంగా ఉండేవారని కూడా చెబుతారు. ఇక ఏపీలో జగన్సీఎం అని 2014 ఎన్నికల వేళలోనే కేసీఆర్ జోస్యం చెప్పారు, కానీ అది అప్పట్లో తిరగబడినా 2019 నాటికి నిజమైంది.ఇక జగన్ సీఎం గా ప్రమాణం చేసే కార్యక్రమానికి కేసీఆర్ హాజరై ప్రత్యేకఆకర్షణగా నిలిచారు. తరువాత కూడా తరచూ ఇద్దరు సీఎం లు మాట్లాడుకోవడాలు, భేటీలు జరుగుతూ వచ్చాయి. కానీ ఈ మధ్య మాత్రం జగన్ కేసీఆర్ కి కొంత ఎడం పాటిస్తున్నారని రాజకీయ వర్గాల సమాచారం. దానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతారు. ఏపీ ఇపుడు ఆర్ధికంగా ఇబ్బందులో ఉంది. విభజన సమస్యలు తెమలడంలేదు, జగన్, కేసీఆర్ రెండు మార్లు నరసింహన్ సమక్షంలో భేటీ అయినా కధ ముందుకు సాగలేదు, ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాలు కొలిక్కి రాలేదు, ఏపీ భవనాల విషయం అలాగే ఉంది. ఈ క్రమంలో జగన్ ఏపీకి రావాల్సిన విద్యుత్ భవనాలవాటాకు బదులుగా వేయి కోట్ల రూపాయల నిధులను అడిగారని, దానికి కేసీఆర్ సర్కార్ నో చెప్పిందని టాక్ కూడా వచ్చింది. నాటి నుంచి కొంత ఎడం కావాలనే జగన్ పాటిస్తున్నారని అంటున్నారు.తాజాగా జరిగిన ఓ పరిణామం కేసీఆర్ పట్ల జగన్ వైఖర్ మారిందా అన్న సంకేతాలకు నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు. విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హేవీ మిషనరీ అండ్ఇంజనీరింగ్ లిమిటెడ్ స్వాధీనం చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం ఓ ఉత్తర్వును జారీ చేసింది. ఇది పూర్తిగా తెలంగాణాలోని సింగరేణి కాలరీస్ కి చెందిన సంస్థ. 84 శాతం సింగరేణి కాలరీస్ వాటా ఇందులోఉంది. సింగరేణి కాలరీస్ కి అవసరమైన భారీ యంత్రాలను తయారు చేసే అతి పెద్ద సంస్థ ఇది. విభజన చట్ట ప్రకారం ఆస్తుల పంపకం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే ఏపీలో ఉన్నందున ఈ సంస్థను జగన్ సర్కార్ తమ స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వు జారీ చేసింది. దీని మీద సింగపూర్ యాజమాన్యం, తెలంగాణా సర్కార్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆరు వందల కోట్ల విలువ చేసే భూములు కూడా కలిగి ఉన్న ఈ సంస్థను సింగరేణికే అప్పగించాలని ఓ విన్నపం సింగపూర్ యాజమాన్యం ప్రతినిధులు కేసీఆర్ కి చేసుకున్నారట. దీని మీద జగన్ తో మాట్లాడుతానని కేసీయార్హామీ ఇచ్చారని టాక్. అయితే సింగరేణి కాలరీస్ లో కూడా తెలంగాణా ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉంది, దాంతో టీఆర్ఎస్ సర్కార్ కూడా ఏపీ సర్కార్ నిర్ణయం మీద గరం గరం గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఇది చిచ్చుగా మారుతుందా, సజావుగా పరిష్కారమవుతుందా అన్నది చూడాలి

No comments:

Post a Comment