Breaking News

06/09/2019

గిన్నిస్ బుక్ రికార్డ్ దిశగా పాలకొండ వినాయక విగ్రహం

పాలకొండ సెప్టెంబర్ 6  (way2newstv.in)
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ లో ఉన్న కాపు వీధిలో ఉత్సవ కమిటీ వారు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం పూర్తిగా నెమలి పింఛను లతో తయారు చెయ్యబడింది.సహజంగా వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా మట్టితో తయారు చేస్తారు.ఈ విగ్రహం మాత్రం పూర్తిగా రెండు లక్షలు పైగా ఉన్న నెమలి పించనాలతో తయారు చేశారు.
గిన్నిస్ బుక్ రికార్డ్ దిశగా పాలకొండ వినాయక విగ్రహం

ఇలాంటి విగ్రహం తయారు చేయడం దేశంలో మొదటిది గా చెప్పవచ్చు.భారీ మొత్తం ఖర్చుతో తయారు చేయబడ్డ ఈ నెమలి పింఛను గణనాధుడుని దర్శించుకోడానికి పాలకొండ ప్రాంత ప్రజలే కాకుండా, జిల్లాలో  ఉన్న అనేక ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తున్నారు.భక్తుల దర్శనార్థం కమిటీ వారు ప్రత్యక ఏర్పాట్లు చేశారు.గిన్నిస్ బుక్ లో నెమలి పించనుతో ఇంత పెద్ద భారీ వినాయకుడు రికార్డ్ లేని కారణంగా ,కమిటీ వారు గిన్నిస్ ప్రతినిధులను సంప్రదిస్తున్నారు. ఏదైనా  ఈప్రాంత ప్రజలకు ,భక్తులకు మంచి వాతావరణంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ,ఈ ప్రాంత ప్రజల అదృష్టం గా భవించవచ్చని భక్తులుఅంటున్నారు.

No comments:

Post a Comment