గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చాణక్య`. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖనిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది.
అక్టోబర్ 5న విడుదలవుతున్న గోపీచంద్ `చాణక్య`
చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్సంగీత సారథ్యం వహిస్తున్నారు.నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు
No comments:
Post a Comment