Breaking News

16/09/2019

రూ.130 కోట్ల మెస్ బిల్లులు బకాయిల బడ్జెట్ వెంటనే విడుదల చేయాలి

ముఖ్యమంత్రికి ఆర్.కృష్ణయ్య లేఖ
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (way2newstv.in)
గత 5 నెలలుగా 2 వేల  ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ లోని  2 లక్షల మంది విద్యార్థుల 130 కోట్ల మెస్ బిల్లులు బకాయిలు చెల్లించకపోవడంతో హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. దీని మూలంగా వార్డెన్లు గత 5నెలలు గా వడ్డిలకు అప్పులు తెచ్చి హాస్టళ్ళు నడిపిస్తున్నారు. లక్షల రూ. ఆప్పులు పెరుగడం మూలంగా హాస్టళ్ళు నడుపడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. వెంటనే బడ్జెట్ విడుదల చేయకపోతేహాస్టళ్ళు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని, బిల్లులు చెల్లించని కారణంగా వ్యాపారస్థులు హాస్టల్స్ కి సరుకులు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు.
రూ.130 కోట్ల మెస్ బిల్లులు బకాయిల బడ్జెట్ వెంటనే విడుదల చేయాలి

చేసిన బకాయిలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు.హాస్టల్నిర్వహణకు  హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అప్పులు తెచ్చి, వాటికి వడ్డి కట్టలేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు..హాస్టళ్ళ అద్దె బడ్జెట్ కుడా రావటంలేదు. కోట్ల రూ. బకాయిలు ఉన్నాయని  ఇంటి యజమానులు వేదిస్తున్నారని పేర్కొన్నారు. .హాస్టళ్ళ కరెంటు బిల్లుల బకాయిలు గత 12 నెలలుగా చెల్లించడం లేదు. కోట్ల రూ. బకాయిలు పేరుక పోయినవి. విద్యుత్ శాఖఅధికారులు పదే,పదే హాస్టళ్లకు కరెంట్ కట్ చేస్తున్నారని, ఒక వైపు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. కరెంట్ కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.  ఒక రోజు కరెంట్లేకపోతే పంపులు నడవక వాటర్ సప్లై లేక విద్యార్థులకు భోజనాలు పెట్టె పరిస్థితి ఉండదు. కావున వెంటనే బకాయిలు విడుదల చేయాలి.హాస్టల్ విద్యార్థులకు గత 8 నెలల నుంచి కాస్మోటిక్ చార్జీలుచెల్లించడం లేదు. సబ్బు, నునెల పైసలు చెల్లించక పోవడంతో విద్యార్థులు చాల ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే 8 నెలల బకాయిలు చెల్లించాలి.కాలేజి హాస్టల్స్ లో విద్యార్థుల సంఖ్యకుతగ్గట్టుగా వర్కర్స్ లేరు. దీని మూలంగా విద్యార్థులకు సకాలంలో భోజనాలు ఏర్పాటు కావడంలేదు.రాష్ట వ్యాప్తంగా దాదాపు 69 పాటశాల బి.సి హాస్టళ్ళను విద్యార్థుల సంఖ్య లేదనే కారణంతోమూసివేశారు. పాటశాల హాస్టళ్ళలో సంఖ్య లేకపోతే కాలేజి హాస్టళ్ళు గా మార్చాలని ప్రభుత్వం జీవో  జారి చేసింది. అయితే హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాద్ మూడు జిల్లాలలో కాలేజి హాస్టళ్ళుప్రారంబించారు. కాని మిగతా జిల్లాలలో ఇంత వరకు కాలేజి హాస్టళ్ళుగా మార్చలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంఖ్య లేని పాటశాల హాస్టళ్ళను – కాలేజి హాస్టళ్ళుగా మార్చాలని, ఇందుకువెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టల్ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment