న్యూడిల్లీ ఆగష్టు 21 (way2newstv.in - Swamy Naidu)
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.2గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్ కచ్ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచావుకు 6 కిలోమీటర్ల వాయువ్య దిశలో సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు భూకంపం సంభవించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment