Breaking News

16/08/2019

సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు అడుగులు

హైద్రాబాద్, ఆగస్టు 16, (way2newstv.in)
హైద్రాబాద్  సిటీ చుట్ట ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేస్థాయిలో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించడం, జిల్లా సరిహద్దున ఉన్న మాల్, చౌటుప్పల్ ప్రాంతాలను కలుపుకుంటూ నిర్మించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. గత ప్రతిపాదనలకు ఊపిరిపోసినైట్లెంది. 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో రూ.7,500 కోట్లతో రీజినల్ రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. సంగారెడ్డి, గజ్వే ల్, చౌటుప్పల్, మాల్, కడ్తాల్, షాద్‌నగర్, చేవెళ్ల, కంది పట్టణాలను కలుపుతూ నిర్మించనున్నారు. బెంగళూరు, విజయవాడ, ముంబై, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను అభివృద్ధి పర్చనున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్కింగ్, ఆహార శాలలు, విశ్రాంత గదులు, పార్కులు, ఆట స్థలాలు, షాపింగ్‌మాల్స్, తాగునీరు, బాత్రూం వంటి సదుపాయాలను ఏర్పాటుచేయనున్నారు.
సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు అడుగులు

సీఎం కేసీఆర్ ప్రకటనతో జిల్లా సరిహద్దున ఉన్న మాల్ సమీపంలో రింగ్ రోడ్డు ని నిర్మించేందుకు కార్యాచరణ మొదలైంది. రహదారుల భవనాల శాఖ దీనిపై ప్రాథమికంగా రూట్‌మ్యాప్‌ను గతంలోనే తయారు చేసింది. . డీపీఆర్ నివేదిక రూపొందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్‌ఆర్‌ఆర్ ను నిర్మాణానికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రాజధాని చుట్టూ అంతర్గత, బాహ్యవలయాలను ఏర్పాటుకాగా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలో స్కైవేలను సైతం ఏర్పాటు చేయాలని సంకల్పిస్తోంది. ఇన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ పెరిగిన వాహనాల రద్దీ దృష్ట్యా రవాణాకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్)ని నిర్మించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌తో అనుసంధానమయ్యే జిల్లా సరిహద్దులో ఉన్న జాతీయ రహదారులను కలుపుతూ ప్రాంతీయ రహదారిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40కి.మీ.ల రేడియేషన్‌లో ప్రాంతీయ రహదారిని నిర్మించేందుకు ఈసరికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.వలయ రహదారి ఏర్పాటు విషయంలో తొలుత అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు ప్రతిపాదనలను రూపొందించింది. రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు 23కి.మీటర్ల దూరంలో ప్రాంతీయ వలయ రహదారిని నిర్మించాలని సీఎం కేసీఆర్ ఏడా ది క్రితం సూచించారు. ఈ మేరకు యాచా రం-నక్కగుట్టతండా మధ్య లో చౌటుప్పల్, షాద్‌నగర్ రహదారులకు సమాంతరంగా.. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న ఔషధ నగరిని ఆనుకుని రింగ్‌రో డ్డును నిర్మించేందుకు సంబంధిత అధికారులు అంచనాలు రూపొందించారు. అయితే ఈ ప్రాంతంలో సరికొండ అటవీ ప్రాంతం ఉండటంతో ఇక్కడ రింగ్ రోడ్డును నిర్మించడం సాధ్యం కాదని అధికారులు ఆ ప్రతిపాదనను పక్కకు పెట్టారు. ఈనేపథ్యంలో సాగర్ రహదారిపై ప్రాంతీయ వల య రహదారిని మాల్-కుర్మేడు మధ్యన ఉన్న ప్రాంతంలో నిర్మించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ దిశగా గతంలోనే ప్రాథమిక సర్వేను నిర్వహించిన అధికారులు మరోమారు సమగ్రంగా సర్వే చేసి డీపీఆర్ నివేదికను రూపొందించేందుకు సన్నద్ధ్దులవుతున్నారు.హైదరాబాద్‌తో అనుసంధానమయ్యే జాతీయ రహదారులన్నింటినీ కలుపుతూ ప్రాంతీయ వలయరహదారిని నిర్మించేందుకు అధికారులు పీడీఆర్ నివేదిక రూపొందించనున్నారు. మాల్ వెలుపల రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పీడీఆర్ నివేదికకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లయితే జిల్లాలో నాలుగు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ మాల్ ప్రాంతంలో రింగ్ రోడ్డు కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం జిల్లాలో  శ్రీశైలం(ఎన్‌హెచ్-765), విజయవాడ(ఎన్‌హెచ్-30), నకిరేకల్(ఎన్‌హెచ్-565) జాతీయ రహదారులు ఉన్నాయి. కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి(ఎన్‌హెచ్-167) పనులు ప్రస్తుతానికి ప్రారంభదశలో ఉన్నా యి. హైదరాబాద్ టూ అమరావతికి హైవేను ఏర్పాటు చేసే యోచ న ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి రాబోవు రోజుల్లో జాతీయ రహదారిగా రూపాంతరం చెందుతుంది. అటు జాతీయ, ఇటు ప్రాం తీయ వలయ రహదారి సాకారంతో హైద్రాబాద్‌ను అనుసరించి ఉన్న ఇతర రాష్ర్టాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడనుంది.

No comments:

Post a Comment