Breaking News

21/08/2019

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి షాక్

న్యూఢిల్లీ, ఆగస్టు 21  (way2newstv.in - Swamy Naidu
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బుధవారం సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన దాఖలుచేసిన పిటిషన్‌‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ముందుంచుతామని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తెలిపింది. చిదంబరం తరఫున సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ హాజరయ్యారు. చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిందని, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను అరెస్ట్ చేయకుండా ఏడాది కిందటే కోర్టు ఆదేశాలు జారీచేసిందన్నారు. తమ ఎదుట విచారణకు రెండు గంటల్లోగా హాజరుకావాలని సీబీఐ, ఈడీలు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు చిందంబరానికి నోటీసులు జారీచేశాయని తెలియజేశారు. 
 కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి షాక్ 
అయితే, ఈ వాదనలు విన్న జస్టిస్ రమణ.. పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టలేమని స్పష్టం చేశారు. తమ పిటిషన్‌ను రిజిస్ట్రీ నోట్ చేశారని సిబల్ అంటే.. అన్ని లాంఛనాలనూ మీరే పూర్తిచేసేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ తరఫున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారని వివరించారు. చిదంబరం పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో అరెస్టు చేయడానికి వెళ్లిన అధికారులకు ఆయన ఆచూకీ దొరకలేదు. సీబీఐతోపాటు ఈడీ కూడా ఆయన కోసం గాలిస్తున్నాయి. అంతకు ముందు, ఏ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారని సీబీఐ అధికారులను చిదంబరం తరఫు న్యాయవాది అర్షదీప్‌ సింగ్‌ ఖురానా ప్రశ్నించారు. అలాగే బుధవారం అత్యవసర స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయడానికి సుప్రీం కోర్టు అనుమతించిందని.. దీనిపై కోర్టు విచారణ జరిపే వరకు వరకు చిదంబరంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణంలో దాదాపు రూ.305 కోట్ల చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 

No comments:

Post a Comment