హైద్రాబాద్, ఆగస్టు 21 (way2newstv.in - Swamy Naidu)
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేరుతో పోస్టులో వచ్చిన బాటిళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ పోస్టల్ కార్యాలయానికి సీఎం, మంత్రుల పేరుతో అనుమానాస్పద పార్సిళ్లు వచ్చాయి. ప్రముఖుల పేరుతో వచ్చిన పార్సిళ్లను గుర్తించిన పోస్టల్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పార్సిళ్లలో వచ్చిన ఆ బాటిళ్లలో ఏముందో కనిపెట్టే పనిలో పడ్డారు. బాటిళ్లలో ఉన్న శాంపిల్స్‌ను తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. పార్సిల్ ద్వారా వచ్చిన సదరు బాటిళ్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఏవైనా ఉన్నాయోమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ కు ఆకతాయిల పార్సిల్స్
సదరు పార్సిళ్లన్నీ ఓయూ అడ్రస్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచి విచారిస్తున్నారు. ఈ పార్సిళ్ల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఐఏఎస్ అధికారులకు వీటిని ఏ ఉద్దేశంతో పంపించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆకతాయిల చర్యా? లేకపోతే.. ఏదైనా సమస్యను హైలెట్ చేయడానికి ఈ దారి ఎన్నుకున్నారా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
No comments:
Post a Comment