Breaking News

09/08/2019

మా ప్రస్తావన మీకెందుకు?: పాకిస్థాన్‌పై మండిపడిన తాలిబన్లు

న్యూ డిల్లీ ఆగష్టు 9 (way2newstv.in - Swamy Naidu):
ఆప్ఘనిస్థాన్‌లో పాలన చేస్తున్న తాలిబన్‌ సంస్థ 'ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆప్ఘనిస్థాన్‌' పాకిస్థాన్‌పై మండిపడింది. కశ్మీర్‌ అంశంతో ఆప్ఘనిస్థాన్‌ను పోల్చడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. ఈ అంశాన్ని పాకిస్థాన్‌ పార్లమెంటులో అక్కడి ప్రతిపక్ష నేత షెబాజ్‌ షరీఫ్‌ ప్రస్తావిస్తూ ‘కాబూల్‌లో ఆప్ఘన్లు శాంతి సౌఖ్యాలతో హాయిగా ఉంటే కశ్మీర్‌లో రక్తం ఏరులై పారుతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. షెబాజ్‌ వ్యాఖ్యలపై మండిపడుతూ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

మా ప్రస్తావన మీకెందుకు?: పాకిస్థాన్‌పై మండిపడిన తాలిబన్లు
కశ్మీర్‌ సమస్య నేపథ్యంలో అసలు ఆప్ఘనిస్తాన్‌ పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని తాలిబన్లు ప్రశ్నించారు. ఇతర దేశాల మధ్య పోటీకి ఆప్ఘనిస్థాన్‌ వేదిక అయ్యేందుకు సిద్ధంగా లేదని, అందువల్ల తమ ప్రస్తావన తేవొద్దని హితవు పలికింది.‘కశ్మీర్‌ అంశంపై భారత్‌ నిర్ణయాలు, అక్కడి కశ్మీరీల పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. కశ్మీరీల హక్కులకు భంగం కలగకుండా దాయాది దేశాలు సంయమనం పాటించాలి. యుద్ధం వల్ల ఎదురయ్యే చేదు అనుభవాలను మేము చవిచూశాం కాబట్టి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment