Breaking News

09/07/2019

టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ నేత సోమారపు సత్యనారాయణ గుడ్

హైదరాబాద్ జూలై 9, (way2newstv.in)
టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీకి గుడ్  చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో అరాచకం పెరిగిపోయిందని ఆరోపించారు. తనపై, అనుచరులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని విమర్శించారు. 
టీఆర్ఎస్ కు  షాక్.. సీనియర్ నేత సోమారపు సత్యనారాయణ గుడ్ 

పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు  కేసీఆర్  అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. కొందరి వల్లే టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నట్లు వెల్లడించారు.  తాను ఏ పార్టీలోనూ చేరనని స్పష్టం చేసిన సత్యనారాయణ, రామగుండం మేయర్ పదవికి పోటీ చేస్తానని అన్నారు. గతంలో రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో తన పాత్ర ఎంత ఉందో ప్రజలకు తెలుసునని వచ్చే ఎన్నికల్లో ప్రజాబలం ఉన్న అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. 

No comments:

Post a Comment