Breaking News

11/07/2019

కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటన

కొల్లాపూర్ జూలై 11 (way2newstv.in)
కొల్లాపూర్ పట్టణంలోని 13వ వార్డు వెంకటేశ్వర టాకీస్ సమీపంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటన చేశారు.  ఉదయం 6 గంటలకే వార్డులో పర్యటించారు.  మంచి నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మురుగు కాలువలు మొదలగు వాటి గురించి కాలనీ వాసులు అడిగి తెలుసుకున్నారు.   అవ్వలను పింఛన్ వస్తుందా అని అడిగారు. ఓ అవ్వ ఎమ్మెల్యే చేయి పట్టుకొని పోయి కాలనీ సమస్యలను వారికి చూయించింది.  
కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  పర్యటన

కాలనీ వాసులను ఆప్యాయతంగా పలకరిస్తూ వెళ్లారు.  కొన్ని ఏండ్ల నుండి మా కాలనిలలోకి ఎవ్వరు రాలేదని, ఓట్ల సమయంలో వచ్చి ఓటు అడిగేవారు, కానీ మా సమస్యలను ఎవరు పట్టించుకోలేదని ఎమ్మెల్యే తో కాలనీ వాసులు అన్నారు.  కంపచెట్లు పెరిగి విష పురుగులు వస్తున్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.  వెంటనే మున్సిపాలిటీ అధికారులకు రెండు రోజులలో 13వ వార్డులోని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.  కాలనిలో ఓ ఇంట్లో టిఫిన్ చేశారు.  మా కాలనిలోకి రావడం మరి టిఫిన్ చేయడం సంతోషంగా ఉందాన్ని కాలనీ వాసులు అన్నారు.

No comments:

Post a Comment