Breaking News

25/07/2019

విద్యా బోధనలో రాజీ వద్దు

కర్నూలు, జూలై 25,(way2newstv.in):
ఐఐటి, మెడిసిన్ పోటి పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించేలా అత్యుతమ శిక్షణ నివ్వాలని జిల్లా కలెక్టర్  జి.వీర పాండియన్ సోషల్ వెల్ఫెర్ రెసిడెన్షిమల్ జూనియర్  కళాశాల ప్రిన్సిపాల్, ఐఐటి డైరెక్టర్లను ఆదేశించారు. గురువారం చిన్నటేకూరు సోషల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను అసిస్టెంట్ కలెక్టర్ విధుఖరేతో కలిసి తనిఖీ చేసారు. కళాశాలలోని బైపిసి, యంపిసి తరగతులను పరిశిలిస్తూ భోదనపై విద్యార్ధులలో ముచ్చటించారు. కాలేజిలో 160 మంది  విద్యార్ధులున్నారని మెరిట్ ఆధారంగా రెండు కేటగిరీలుగా విభజించి శిక్షణ నిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సియండి ఇర్ఫాన్ కలెక్టరుకు నివేదించారు. భోధనలో రాజీ లేకుండా విద్యార్ధులకు ఉత్తమ విద్యను అందించాలన్నారు. ఇందుకు అవసరమైన మోటీరియల్, పుస్తకలు సమకూర్చుకోవలన్నారు. 
విద్యా బోధనలో రాజీ వద్దు

ఎస్.సి, ఎస్.టి మైనర్టీ విద్యార్ధులకు ప్యారెలల్ ఐఐటి ఇన్ స్టిట్యూట్ స్థాపనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రిన్సిపాల్ ను  ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే స్టక్చర్ బ్లూప్రింట్, అప్రోచ్ ప్లాన్ తదితర అంశాలతో తయారు చేయాలన్నారు. కళాశాలకు అవసరమయ్యే సివిల్ పనులకు సంబంధిత ఇ.ఇతో ప్రతిపాదనలు సమర్పిస్తే బడ్జెట్ కేటాయింపుకు చర్యలు తీసుకోంటామన్నారు. అనంతరం  కాలేజి తరగతి గదులతోపాటు రెసిడెన్సియల్, డార్మిమెటరీ హాళ్లు, టాయిలేట్లను పరిశీలించారు. వంటగదిలో తయారు చేస్తున్న ఆహార పదార్ధాల గురించి తెలుసుకుంటూ సంతృప్తి వ్యక్తం చేసారు. బోధనలో లోపాలు లేకుండా ఉత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్ధులను తీర్చీదిద్దాలన్నారు. జిల్లా నుండి కాక శ్రీకాకుళం, తూర్పు,పశ్చిమ,గోదావరి, విజయనగరం జిల్లాల నుండి వచ్చిన  విద్యార్ధులు కూడ విద్యసభ్యసిస్తున్నారని ప్రిన్సిపల్ కలెక్టరుకు నివేదించారు. ఐఐటి డైరెక్టర్ రామసుబ్బారెడ్డి, తసీల్దార్ రవి కూమార్, కళాశాల అధ్యాపాకులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment