Breaking News

20/07/2019

డిజిటల్ మీడియాలో కనిపించని చిత్తూరు

తిరుపతి, జూలై 20, (way2newstv.in)
చిత్తూరు జిల్లా సమాచారం కావాలంటే మాత్రం కచ్చితంగా అధికారుల దగ్గరకు వెళ్లాల్సిందే. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకూ వెబ్‌సైట్‌ ఉంది. దాంట్లో సమస్త సమాచారం పొందుపరిచారు. అయితే  చిత్తూరు జిల్లాకు రెండు సంవత్సరాలుగా అసలు వెబ్‌సైట్‌ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు వెబ్‌సైట్‌ కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే.. జిల్లా అత్యున్నతాధికారి మాత్రం సోషియల్‌ మీడియాపై మోజు పెంచుకున్నారు. దీని కోసం సంవత్సర కాలంగా రూ.2కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామకుంటున్నారు. 
డిజిటల్ మీడియాలో కనిపించని చిత్తూరు

కలెక్టర్‌ సొంతంగా ఏర్పాటు చేసుకున్న సోషియల్‌ మీడి యా వింగ్‌ వల్ల ప్రజలకు ప్రయోజనం ఒనగూరడం లేదు. ఆయన వెళ్లే కార్యక్రమాలే అందులో ఉంటు న్నాయి. ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలు చేరడం లేదనేది సుస్పష్టం. అతితక్కువ «ఖర్చుతో ప్రజలకు ఎంతో సమాచారం ఇచ్చే వెబ్‌సైట్‌ను పక్కనబెట్టడంపైన అసంతృప్తి పెల్లుబుకుతోంది.డిజిటల్‌ కరెన్సీ, డిజిటల్‌ ఇండియా అంటూ అధికారులు మాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించడానికే ఈ గవర్నెన్స్‌ ప్రవేశపెట్టారు. అయితే జిల్లాలో గవర్నెన్సే కనిపించడం లేదు. జిల్లాలో ఏయే పథకాలు అమలవుతున్నాయో ప్రజలకు తెలియడం లేదు. ఏ పథకానికి తాము అర్హులో తెలుసుకోడానికి చాన్సే లేకుండా పోతోంది. సమాచారం కోసం ప్రజలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే అధికారులను కలుస్తున్నారు. దీంతో జిల్లాలో అవినీతి పెరిగిపోతోంది. దీన్ని నివారించడానికైనా వెబ్‌సైట్‌ ప్రారంభించి సమస్త సమాచారాన్ని పొందుపరచాలనిప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments:

Post a Comment