Breaking News

09/07/2019

పితానికి కష్టాలు...


ఏలూరు, జూలై 9, (way2newstv.in)
వరుసగా 15 సంవత్సరాలపాటు ఎమ్మెల్యే…. చివరి పదేళ్లలో…. ఏడేళ్లపాటు మంత్రిగా చక్రం తిప్పారు. జిల్లా రాజకీయాల్లో ఆయనది ప్రత్యేకమైన ప్రస్థానం. పార్టీలు మారినా…. నియోజకవర్గాలు మారినా గెలుపు మాత్రం ఆయనదే అయ్యింది. అలాంటి నేత తాజా ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా తీవ్రమైన గందరగోళ పరిస్థితుల్లో పడిపోయారు. ఆయనే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన పితాని, 2009 – 2014లో నుంచి వరుస విజయాలు సాధించారు. తొలి రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన 2014 ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసి మరి ఎమ్మెల్యే సీటు దక్కించుకుని విజయం సాధించారు.2017 క్యాబినెట్ ప్రక్షాళనలో మరోసారి మంత్రి పదవి దక్కించుకున్న పితాని సత్యనారాయణ మొత్తం ఏడు సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. కులరాజకీయాలకు పితాని పెట్టింది పేరు. పితాని వరుసగా మూడుసార్లు గెలిచారు అంటే అందుకు ఆయన సొంత సామాజిక వర్గం ఆయన శెట్టిబ‌లిజ‌ల‌ మద్దతు ఎప్పుడూ సంపూర్ణంగా ఉండేది.

పితానికి కష్టాలు... 

2004 ఎన్నికల్లో శెట్టి బలిజ‌లు అంతా పితానిని గెలిపించుకోవాలని తీర్మానం చేశారంటే ఈ సామాజిక వర్గంలో ఆయనకు ఎంత గట్టి పట్టు ఉందో తెలుస్తోంది. ఆచంట నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఓటర్లదే ఆధిపత్యం. అందుకే పార్టీలతో పని లేకుండా పితానిని వాళ్ళు వరుసగా గెలిపించారు.ఈ క్రమంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి గెలిచాక ఆయ‌న‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో కూడా మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ టిడిపి నుంచి మూడో సారి గెలిచాక చంద్రబాబు మంత్రివర్గంలో పని చేశారు. నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా పని చేసిన ఘనత కూడా పితాని సొంతం చేసుకున్నారు. అలాంటి పితాని తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ రంగ‌నాథ‌రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయంగా ఆయన ఇప్పుడు సొంత పార్టీలోనే కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చేసింది. వాస్తవానికి ఆచంట నియోజకవర్గంలో పితానిని టీడీపీలోనే కొన్ని బలమైన వర్గాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇక జిల్లా టిడిపి నేత‌ల్లో కూడా మాగంటి బాబు – చింతమనేని ప్రభాకర్ – ఆరిమిల్లా రాధాకృష్ణ ఇలాంటి నేతలతో ఆయ‌న‌కు పొసిగేది కాదు.వాస్తవానికి ఈ ఎన్నికలకు ముందే పితానికి వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆచంట అసెంబ్లీ లేదా నరసాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పినా పితాని సత్యనారాయణ చివర వరకూ ఊగిస‌లాట‌ ధోరణిలోనే ఉండి తిరిగి టిడిపి నుంచి పోటీ చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ కుల సమీకరణాలతో గట్టెక్కే పితానికి ఈసారి సొంత సామాజిక వర్గంలోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. పితానికి వ్యతిరేకంగా త‌న వ‌ర్గంలోనే చీలిక రావడంతో ఈసారి ఆయన పాచిక పారలేదు. ఇప్పటికే వయసు పైబడడంతో పితాని తన రాజకీయ వారసుడిగా తన కుమారుల్లో ఒక‌రిని రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగానూ… నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని వారసులకు అంత సీన్ లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పితానిని టీడీపీలో ఆ పార్టీ వాళ్లే అణ‌గ‌దొక్కే ప్రయ‌త్నాలు చేస్తార‌న‌డంలో సందేహం లేదు. వైసీపీలోకి వెళ్లలేరు. ఆచంట‌లో బీజేపీకి లాంటి పార్టీల‌కు సీన్ లేదు. దీంతో ఒక్క ఓట‌మితో పితాని ఫ్యూచ‌ర్ పూర్తి డైల‌మాలోకి వెళ్లిపోయింది.

No comments:

Post a Comment