Breaking News

15/07/2019

పది డిజైన్లు.. పది రకాలు బతుకమ్మ చీరలు

మెదక్, జూలై 15, (way2newstv.in
బతుకమ్మ చీరెలను పది డిజైన్లలో, ఒక్కో డిజైన్ పది రంగుల్లో తయారుచేస్తున్నారు. దీంతో వంద వెరైటీల్లో చీరెలు తయారు కానున్నాయి. తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏండ్ల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను సీఎం కేసీఆర్ కానుకగా అందజేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది అర్హులు ఉంటారనే అంచనాతో చీరెల తయారీ ప్రారంభించారు. ఒకచీరె 5.5 మీటర్లు, జాకెట్ 80 సెంటిమీటర్ల చొప్పున కోటి మందికి మొత్తం 6.3 కోట్ల మీటర్ల చీరె అవసరం. ఇప్పటివరకు రెండుకోట్ల మీటర్ల చీరెలు తయారుచేసినట్టు సమాచారం. చీరెల తయారీని సిరిసిల్లలోని మరమగ్గాలపై తయారుచేసేలా ఆర్డర్లు ఇచ్చారు. వీటి కోసం ప్రభుత్వం రూ.320 కోట్లు వెచ్చించనున్నది. 
 పది డిజైన్లు.. పది రకాలు బతుకమ్మ చీరలు

తయారైన చీరెలను ఆగస్టు 15 తర్వాత జిల్లాలకు తరలించనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. చీరె ల పంపిణీని ఆనెల15 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 17 వేల మరమగ్గాల మీద బతుకమ్మ చీరెలు తయారవుతున్నాయి. వచ్చేవారంనాటికి మగ్గాలసంఖ్యను 20 వేలకు పెంచి చీరెల తయారీని వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. చీరెల తయారీతో సిరిసిల్లలో కార్మికులకు ఆరునెలలు చేతినిండా పనిదొరుకుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కార్మికులకు ప్రతినెలా కనీసం రూ.20 వేలు వేతనంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టారు.  కొంత మంది మహిళలు ఎనిమిది గజాల చీరెలను ధరించేందుకు ఇష్టపడుతారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిది గజాల చీరెలను నేయిస్తున్నారు. ఎనిమిది గజాల చీరెలను 8.2 మీటర్లతో, 80 సెంటీమీటర్లతో జాకెట్‌ను అందిస్తారు. వీరికోసం ప్రత్యేకంగా 10 లక్షల చీరెలను తయారుచేయిస్తున్నారు.

No comments:

Post a Comment