Breaking News

01/07/2019

మరింత ధరలు తగ్గిన టటా స్కై


విజయవాడ, జూలై1 (way2newstv.in)
టీహెచ్ సబ్‌స్క్రైబర్లకు శుభవార్త. ప్రముఖ డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) కంపెనీ టాటా స్కై తాజాగా తన సెట్ టాప్ బాక్స్‌ల ధరలు తగ్గించింది. ఎస్‌డీ, హెడ్‌డీ రెండు విభాగాల సెట్ టాప్ బాక్స్ ధరలు దిగొచ్చాయి. సెట్ టాప్ ధరల తగ్గింపు ఇది రెండోసారి కావడం గమనార్హం. కంపెనీ గత నెలలోనూ సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) ధరల్లో కోత విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త ఎస్‌డీ బాక్స్ 1,399కు అందుబాటులో ఉంది. ఇక హెచ్‌డీ బాక్స్ ధర రూ.1,499 నుంచి ప్రారంభమౌతోంది. 

మరింత ధరలు తగ్గిన టటా స్కై

అధిక ఫీచర్లు కలిగిన టాటా స్కై ప్లస్ హెచ్‌డీ బాక్స్ ధర రూ.9,300గా ఉంది. ఈ సెట్ టాప్ బాక్స్ కలిగిన యూజర్లు లైవ్ టీవీని కావాలనుకుంటే పుష్ చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి మూడు ఛానాళ్లను రికార్డు చేసుకోవచ్చు.  అలాగే టాటా స్కై 4కే సెట్ టాప్ బాక్స్ ధర రూ.6,400గా ఉంది. ఇకపోతే టాటా స్కై సెట్ టాప్ బాక్స్‌లను ఆఫ్‌లైన్ సహా ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. దీంతో కంపెనీ యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇకపోతే ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా డీటీహెచ్ సర్వీసెస్ ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ూజర్లు ఓవర్ ద టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ సర్వీసులవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో, హాట్‌స్టార్, వూట్, సోనీ లైవ్, జీ5 వంటి వాటికి పోటీ ఇచ్చేందుకు టాటా స్కై తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. మరోవైపు టాటాస్కై కూడా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ టాటా స్కై ఎడిషన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రూ.249కే అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, హంగామా వంటి పలు సేవలు పొందొచ్చు. టాటా స్కై యూజర్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి

No comments:

Post a Comment