Breaking News

23/07/2019

ముగ్గురిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

ఉపసభాపతిని కోరిన తెదేపా ఎమ్మెల్యేలు
అమరావతి జూలై 23 (way2newstv.in)
ముగ్గురు తెదేపా సభ్యులను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. మంగళవారం తేనీటి విరామ సమయంలో ఉపసభాపతి కోన రఘుపతితో సమావేశం అయ్యారు అయ్యారు.  ఎమ్మెల్యేల సస్పెన్షన్పై చర్చించారు. నిరసన తెలియజేయడం సభ్యుల హక్కు అని, దానిని కూడా కాలరాయడం అప్రజాస్వామికమతుందని డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
ముగ్గురిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్థానంలోనే ఉన్నారని, అతడిని సస్పెండ్ చేయడం దారుణమని ఆయనతో చెప్పారు.  ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తొలిసారి సస్పెండ్ చేశారని, ఇది అన్యాయమని అన్నారు. నిమ్మల రామానాయుడిని మార్షల్స్ బలవంతంగా మోసుకుపోవడం అప్రజాస్వామికమని వారందరిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిప్యూటీ స్పీకర్ను కోరారు. ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేయడంపై అధికార పక్షం తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖండించారు. ప్రతిపక్షం మనోభావాలను స్పీకర్ అర్థం చేసుకోవాలన్నారు. అధికార పక్షానికి అసహనం పనికిరాదని అన్నారు.

No comments:

Post a Comment