Breaking News

26/07/2019

అడ్డూ, అదుపు లేకుండా మైనింగ్

వరంగల్, జూలై 26, (way2newstv.in)
భూగర్బజలాలు అడుగంటిపోతే వ్యవసాయాదారిత రైతుల మనుగడకు ముప్పువాటిళ్లుతుందనే అంశాన్ని గుర్తించాలి. దుమ్మూ, ధూళీ, కాలుష్యం వల్ల గ్రామలు చిధ్రం అవుతాయని, ఆనారోగ్యాలు బహుమానంగా భవిష్యత్‌తరాలకు అందించాల్సి వస్తుందని ప్రజలు గుర్తించాలి. ఊరుమ్మడి సొమ్మయిన ప్రకృతిసంపదలు కళ్లముందే కరిగిపోతుంటే చూస్తూ ఊరుకోవటం కంటే రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వినాశనానికి దారి తీస్తున్న మైనింగ్‌కు సంబంధించిన ఇటువంటి క్రషర్లు, క్వారీలు, డాంబర్‌ప్లాంట్ల నిర్వహణ తీరును క్రమబద్ధం చేసి సహజ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమ్మని నీరు, స్వచ్ఛమైన గాలి, అహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన పంటలు పల్లె బతుకులకు వరాలుగా మనం భావిస్తుంటాం. కానీ నేడు వీటన్నింటినీ చిందరవందరచేసే చర్యలు మన కళ్లముందే జరిగిపోతున్నాయి. 
అడ్డూ, అదుపు లేకుండా మైనింగ్

చూస్తుండగానే ప్రకృతి సంపద కరిగి పోతుంది. అయితే అభివృద్ధిపేరుతో ముందుకొచ్చే గనుల తవ్వకాలు కావచ్చు, క్వారీలు కావచ్చు, లేదా క్రషర్లు, డాంబర్‌ప్లాంట్లు కావచ్చు, ప్రకృతిని చిందరవందర చేసేవిగానే ఉంటాయనేది గమనించాలి. వీటికి అభివృద్ధి ముసుగు తగిలించి అందమైన తర్కం చెప్పే పెద్దమనుషులు కూడా లేకపోలేదు. కానీ ఇవన్ని చట్టబద్దంమైన నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించబడుతున్నాయా…? అందుకు విరుద్దంగా నిర్వహించబడుతున్నాయా అనేది ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఇంకా కొంతమంది వాదన కూడా వీటి నిర్వహణను సమర్థించేదిగానే ఉంటుంది. గుట్టలను కరింగించకుంటే వాటినుంచి వెలువడే ముడిసరుకు ఎక్కడి నుంచి తేవాలి…? క్రషర్లు, క్వారీలు, డాంబర్‌ప్లాంట్లు లేకుంటే వాటికి అనుసంధానమైన ముడిసరుకులు ఎలా వస్తాయి అనే వాదనలు కూడా చేస్తుంటారు. అయితే వీటి నిర్వహణతో ప్రకృతికి, ప్రజలకు, ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయానికి, గ్రామాలకు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనే అంశాన్ని పరగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. పర్యావరణ పరిరక్షణ సురక్షితంగానే ఉంటుందా..? గనులు, క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్ల మూలంగా జీవజాలనికి, మనుషులకు నివాసయోగ్యమైన ప్రాంతాలకు వాటిల్లే లాభనష్టాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరముంది. అయితే ఇక్కడ మరో అంశాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించాలి. వీటి నిర్వహణ వల్ల అత్యంత విలువైన జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాలు దెబ్బతినడం, పర్యావరణ సమతుల్యం నాశనమవటం లాంటి విపరీత పరిణామాలకు ముఖ్యంగా గనుల తవ్వకాలు ప్రధాన కారణమని గత దశాబ్దంగా గనుల చరిత్రలో తేలిన చేదు నిజంగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే గనులు మాత్రమే కాదు క్రషర్లు, క్వారీలు, డాంబర్‌ ‌ప్లాంట్ల వల్ల కూడా పర్యావరణం దెబ్బతినటం, భూగర్భజలాలు అడుగంటి పోవటం, వ్యవసాయాధారిత రైతులకు నష్టం వాటిల్ల్లటం, కాలుష్యకోరల్లో చిక్కుకొని గ్రామాలు కూడా మూల్యం విలవిలలాడడం అనివార్యం అవుతుందనేది గమనించాలి. ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఉపయోగించే నీటి కన్నా గనులకు పయోగించే నీటి పరిణామం రానురాను పెరిపోతుందని, 2075 నాటికి వ్యవసాయరంగానికి కావాల్సిన నీటిలో 50శాతం కోత ఏర్పడుతుందని, మనిషి తలసరి నీటి వినియోగం 1700 క్యూబిక్‌మీటర్ల కన్నా తక్కువ స్థాయికి పడిపోతుందని, నీటి ఎద్దడిని ఆఫ్రికా, ఆసియా దేశాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ‘పైలెట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ‌గ్లోబల్‌ ఎకో సిస్టమ్‌’ ‌జరిపిన సర్వేలో నిర్థారించారు. ఈ లెక్కన గనులు, క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్ల వల్ల ఏ మోదాతులో నష్టం ఉంటుందో బేరీజు వేసుకోవాలి. గనుల తవ్వకాలు ఎక్కడో ఉన్నాయని ఉదాసీనంగా ఉండటం కంటే ప్రకృతి సంపదను కొల్లగొట్టే విధంగా నిర్వహంచబడుతున్న క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ ‌ప్లాంట్ల నిర్వహణ తీరును ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరముంది.
చూస్తుండగానే మన ఊరుమ్మడి సొమ్ముగా భావించే పలు గ్రామాల పరిధిలోని గుట్టలు కరిగిపోవటం జరుగుతుందనేది కాదనలేని సత్యంగా ఉంది. క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్ల పేరుతోల యథేచ్చగా రాబందుల రాజ్యం కొసాగుతూనే ఉంది. వీటి నిర్వహణ చట్టం విధించిన నిబధనల పరిధిలోనే జరుగున్నదా…లేక నిబంధనలు తుంగలో తొక్కబడుతున్నాయా అనే ప్రశ్నించే నాథుడుగాని, పరిశీంచే వారుగాని లేకపోవటం యజమానులకు వరంగా మారింది. ప్రకృతి, పర్యావరణానికి నష్టం చేసేవిధంగా, సహజ సంపదను కొల్లగొట్టే విధంగా, వ్యవసాయా ఆధారిత ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు నష్టంజరిగే విధంగా, ఏ రకంగా చూసినా భవిష్యత్తు కు అన్ని విధాలుగా చేటుచేస్తుంది. భూరగర్బజాల పరిస్థితి ఎలా ఉంది..? దుమ్మూధూళీ వల్ల జరిగే అనారోగ్యసమస్యలు ప్రజలను ఎలా పట్టిపీడిస్తున్నాయి…? అనే సర్వేలు గానీ, పరిశీలనలు గానీ జరుగకపోవటం భవిష్యత్‌తరాలకు చాలా నష్టం చేస్తుందనేది గుర్తెరుగాల్సిన అవసరం ఉంది. సమగ్రంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన సంబంధిత శాఖలు యజమానులకు ఏదోవిధంగా బానిసలుగా మారుతున్నాయని పరిస్థితులు గమనిస్తే తేటతెల్లం అవుతున్నది. ఆయా గ్రామాల పరిధిలో ఉండే వాటికి సాక్ష్యాత్తు ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. దేశం, రాష్ట్ర పరిస్థితిని తేలిపేవిధంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నిర్వహించబడుతున్న క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్ల తీరును ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వందల సంఖ్యలో కొనసాగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోగా యజమానులకు వత్తాసుపలుకే విధంగా వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ప్రజాప్రతినిధులే క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్ల నిర్వహణ చేస్తున్నారంటే వాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక, మాందారిపేట, ప్రగతిసింగారం, కొత్తగట్టు, సింగారం తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా క్రషర్లు, డాంబర్‌ప్లాంట్లు అధికారులు, ప్రజాప్రతినిధుల కలయికతో నడుస్తున్నాయి. వీటి పర్యావసనాలు గ్రహించని జనం భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదనేది కూడా గ్రహించాలి. క్రషర్ల నిర్వహణలో భాగంగా బాంబు బ్లాస్టింగ్‌లు నిర్వహించటం వల్ల సమీప గ్రామాలలో ఇండ్లుసైతం కంపించిపోవడంపై గతంలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయనేది గమనార్హం. క్రషర్ల దుమ్మధూళి వల్ల చుట్టుపక్కల పంటలకు సైతం నష్టం వాటిల్లడం సర్వసాధారణంగా మారింది. మాందారిపేట లాంటి చోట వీటి ప్రభావంతో ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలయిన •దంతాలున్నాయి. పెద్దాపూర్‌ ‌లాంటిచోట మనుషులు చనిపోయిన సందర్భాలున్నాయి. చనిపోయిన వారి గురించి స్పందించే వారే కరువయ్యారనే విషయం గమనార్హం. అయితే ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లావ్యాప్తంగా ఈ స్థాయిలో ఇటువంటి వ్యాపారాలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు ఉంటున్నారనేది స్పష్టమవుతుంది.ప్రకృతిలో చోటుచేసుకునే పరిణామాలు భవిష్యత్‌తరాలకు ఎలాంటి నష్టదాయకంగా మారబోతున్నాయో గుర్తించాల్సిన అవసరముంది. దీనికి కారణమవుతున్న పరిస్థితులను అరికట్టే విధంగా ప్రజలు, ప్రజాసంఘాలు అప్రమత్తం కావాలి. భూగర్బజలాలు అడుగంటిపోతే వ్యవసాయాదారిత రైతుల మనుగడకు ముప్పువాటిళ్లుతుందనే అంశాన్ని గుర్తించాలి. దుమ్మూ, ధూళీ, కాలుష్యం వల్ల గ్రామలు చిధ్రం అవుతాయని, ఆనారోగ్యాలు బహుమానంగా భవిష్యత్‌తరాలకు అందించాల్సి వస్తుందని ప్రజలు గుర్తించాలి. ఊరుమ్మడి సొమ్మయిన ప్రకృతిసంపదలు కళ్లముందే కరిగిపోతుంటే చూస్తూ ఊరుకోవటం కంటే రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వినాశనానికి దారి తీస్తున్న మైనింగ్‌కు సంబంధించిన ఇటువంటి క్రషర్లు, క్వారీలు, డాంబర్‌ప్లాంట్ల నిర్వహణ తీరును క్రమబద్ధం చేసి సహజ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment