Breaking News

18/07/2019

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి

ప్రిన్సిపాల్, లెక్చరర్లు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ 
జగిత్యాల జూలై 18 (way2newstv.in)
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కళాశాల ప్రిన్సిపాళ్ల తో జిల్లా కలెక్టర్ డాక్టర్ డీసీ డి ఆర్ సి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. 
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి 

అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని, ఉత్తీర్ణత శాతంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో బాలుర వసతిగృహాన్ని మంజూరు చేసి ప్రభుత్వం కళాశాల విద్యార్థులందరూ చేరేలా ప్రోత్సహించాలన్నారు. మహిళా వసతి గృహంలో సమస్యలు ఉన్నట్లయితే అద్దె భవనాల్లోకి మార్చాలని సూచించారు  అనంతరం మెట్ పల్లి, కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు, ఉత్తీర్ణత శాతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి రాజేశం కో- ఆర్డినేటర్ డాక్టర్ అశోక్, కళాశాలల ప్రధానోపాధ్యాయులు చంద్ర కుమార్, శ్రీనివాస్ రెడ్డి, వాసవి, జిల్లా కోశాధికారి ఎస్ పద్మ , అధ్యాపకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment