Breaking News

18/07/2019

వసతి గృహాలు అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్ శ్రీధర్
నాగర్ కర్నూలు జూలై 18 (way2newstv.in)
పనితీరును మార్చుకోండి, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. ప్రతి విద్యార్ధిని సొంత బిడ్డలా ఆదరించండి. వసతి కోరిన ప్రతి విద్యార్ధిని హాస్టల్లో ప్రవేశం కల్పించండి. ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇ శ్రీధర్ వసతి గృహ సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు సూటిగా ఆదేశించారు.గురువారం  కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ వసతి గృహాలపై సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి అధికారులను ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి ఆ  అధికారిచే వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి పరిశీలించి విద్యార్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులు స్వయంగా పరిశీలించి, అదే రోజు జిల్లా కలెక్టర్ కు నివేదికలను సమర్పిస్తారని జిల్లా కలెక్టర్  ఈ శ్రీధర్ స్పష్టం చేశారు. 
వసతి గృహాలు అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగితే  క్రమశిక్షణ చర్యలు తప్పవు 

జిల్లా అధికారులకు కేటాయించిన మండలాల్లో ఉన్న వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర,బాలికల వసతి గృహలను, సాంఘిక సంక్షేమ బాలుర, బాలికల వసతి గృహాలను, కస్తూరిబా విద్యాలయాలను ప్రెసిడెన్షియల్ పాఠశాలలను, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి. వసతి గృహాలను పరిశీలించిన విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల హాజరు వసతి గృహాల్లో  పరిశుభ్రంగా ఉన్నాయా లేవా పరిసరాలన గమనించి సిబ్బంది పనితీరు విద్యార్ధులతో మాట్లాడి సమస్యలను సేకరించి నివేదికలను అందజేస్తారని అనంతరం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహాల్లో విద్యార్థులు అపరిశుభ్ర వాతావరణంలోనే కొనసాగిస్తే మాత్రం ఉపేక్షించనని హెచ్చరించారు.   వసతి గృహ విద్యార్ధులను మీ సొంత బిడ్డల వలె చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని పేర్కొన్నారు.  వసతి గృహాల్లో పనిచేసే అధికారులు పద్దతిని మార్చుకోకుంటే ఇకపై ఉపేక్షించబోనని జిల్లా కలెక్టర్  స్పష్టం చేశారు. మండలాల కేటాయించిన జిల్లా అధికారులు ఏ రోజు ఏ వసతి గృహాన్ని సందర్శిస్తానో ముందుగా తెలియజేయనని తాను నిర్ణయించిన ప్రకారమే తనిఖీ చేస్తారని తనిఖీ చేస్తున్న సమయంలో విద్యార్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రత, విద్యాబోధన వంటి విషయాలలో ఆలసత్వాన్ని ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుక వెనుకాడనన్నారు. ప్రతివారం ప్రభుత్వం ప్రకటించిన రోజువారి మెనూ ప్రకారం భోజనాలను అందించాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్ధులకు ఖర్చు పెడుతున్నదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్ధులు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ అన్నారు. వసతి గృహంలో విద్యార్ధులకు అందిస్తున్న ఆహార పదార్ధాలను సందర్శించిన అధికారులు స్వయంగా పరిశీలించాలని, ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా సంబంధిత మండల ప్రభుత్వ డాక్టర్ లతో ఆరోగ్య పరీక్షలు చేయించాలని విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారుల అలసత్వం ప్రదర్శించకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ జిల్లా సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖల అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment