Breaking News

02/07/2019

లైఫ్ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తున్న వాహానదారులు


తిరుపతి, జూలై 3, (way2newstv.in
చిత్తూరు జిల్లాలో సుమారు  54 వేల వాహనాలు జీవితకాలపు పన్ను  చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో  ప్యాసింజర్‌ ఆటోలు 27,633, మినీ గూడ్స్‌ వెహికల్స్‌ (మూడు చక్రాల వాహనాలు) 3,835, టాటా ఏస్, మహేంద్ర మ్యాక్స్‌ (నాలుగు చక్రాలు) వాహనాలు సుమారు 10 వేల వరకు ఉన్నాయి.తిరుపతి పరిధిలో ప్యాసింజర్‌ ఆటోలు 11,784, మినీ గూడ్స్‌ వెహికల్స్‌ 1,174,  టాటా ఏస్, మహేంద్ర మ్యాక్స్‌ వాహనాలు 2,126 ఉన్నాయి. వీటి జీవిత కాల పన్ను చెల్లింపు గడువు 6 నెలలుగా నిర్ణయించి ప్రభుత్వం ప్రకటించింది.కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే  లైఫ్‌ టైం ట్యాక్స్‌ వేసేందుకు సిద్ధమయ్యారు.  ప్రయాణికులను తరలించే ప్యాసింజర్‌ ఆటోలకు ఆటో విలువలో రెండు శాతం మొత్తాన్ని పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. వాహనం ఇది వరకే రిజిస్ట్రేషన్‌ అయి  మూడేళ్లు గడిచి ఉంటే, దాని విలువలో 1.5 శాతం పన్ను కట్టాల్సిందే. 6 నుంచి 9 ఏళ్ల లోపు రిజిస్ట్రేషన్‌ అయివుంటే 1.3 శాతం పన్ను, 9 ఏళ్లు మించితే 1 శాతం  పన్ను కట్టాల్సి ఉంటుంది.

 లైఫ్ ట్యాక్స్  ఎగ్గొట్టేస్తున్న వాహానదారులు

కొత్త  మినీ ట్రాన్స్‌ఫోర్టు వెహికల్‌ కు వాహన విలువలో  7 శాతం జీవిత కాలం పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాలకు  6.5 శాతం, 6 నుంచి 9 ఏళ్ల లోపు రిజిస్ట్రేషన్‌ వాహనాలకు 4 శాతం, 9 ఏళ్లు పైబడిన వాహనాలకు దాని విలువలో 1 శాతం పన్నుఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది.రిజిస్ట్రేషన్‌ సమయంలో ఈ–రిక్షాకు రూ.1000, ఈ–కారుకు రూ.2వేలు చొప్పున జీవికాలపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసిన వాహనాలకు ఐదేళ్లు మించిన ఈ–రిక్షాకు రూ.900లు, ఈ –కారుకు రూ.1800  చెల్లించే విధానం ఉంది.జిల్లాలో సకాలంలో  పన్నులు చెల్లించని ఎగవేతదారులను అరికట్టే ఉద్దేశంతో  రాష్ట్ర రవాణా శాఖ జీవిత కాలంపు పన్ను విధానాన్ని ఏక కాలంలో చెల్లించే  విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో సకాలంలో పన్ను వసూలు చేయవచ్చని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. త్రైమాసిక పన్ను చెల్లింపు విధానంలో బకాయిలు ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయి రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతోంది. పన్ను చెల్లించని వాహనాలపై కేసులు నమోదు చేయడం, వాటిని జప్తు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుత జీవిత కాలపు పన్ను విధానంతో  ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా పన్నులు నిక్కచ్చిగా సకాలంలో వసూలు చేయవచ్చు

No comments:

Post a Comment