Breaking News

22/07/2019

108 కిందకు మరిన్ని వైద్య సేవలు

విజయవాడ, జూలై 22 (way2newstv.in)
రాష్ట్రంలో ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అసెంబ్లీలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 108 అంబులెన్స్ సంఖ్యను 439 నుంచి 710కి పెంచుతామన్నారు. సోమవారం శాసనసభలో చేపట్టిన ప్రశ్నోత్తరాల సందర్భంగా... రాష్ట్రంలో వైద్యసేవలు, 104,108 వాహనాల నిర్వహణపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ముందుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
108 కిందకు మరిన్ని వైద్య సేవలు

రోగుల సంబంధీకుల నుంచి ఫోన్ రాగానే నిమిషాల వ్యవధిలోనే 108 అంబులెన్స్‌ వెళ్లి నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి.. 108 అంబులెన్స్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సభ్యుల ప్రశ్నలకు స్పందించిన హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని... ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో వైద్య సేవలకు ఇచ్చిన ప్రాధాన్యతను తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోవడం వల్ల 104, 108 సర్వీసులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. బడ్జెట్‌లో 104 సర్వీసులకు రూ.179.76 కోట్లు, 108 సర్వీసులకు రూ.143.38 కోట్లు కేటాయించామని తెలిపారు. 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఆ సర్వీసులు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. 

No comments:

Post a Comment