Breaking News

06/06/2019

సిటీలో స్వచ్చత యాప్


హైద్రాబాద్, జూన్ 6, (way2newstv.in)
హైదరాబాద్ ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు  ప్రణాళికలు అమలు చేస్తున్న జిహెచ్ఎంసి ప్రజల్ని భాగస్వాముల్ని చేసేందుకు  సిద్ధమైంది.  ఇప్పటికే  స్వచ్ఛ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  నిబంధనలు ఉల్లంఘించే వారిపై  చర్యలు తీసుకుంటోంది.  క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారులు,  సిబ్బంది తనిఖీలు నిర్వహించి  స్వచ్ఛతకు భంగం కలిగించే వారికి  జరిమానా విధిస్తోంది.  వీధుల్లో చెత్త పడేయడం,  భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై  వేయడం,  వీధుల్లోకి నీరు వదిలి  రోడ్లు దెబ్బతినేందుకు కారణమవుతున్న వారిపై  కఠినంగా  వ్యవహరిస్తోంది.  క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు మాత్రమే  ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  కానీ సిటీలో నిరంతరం ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి.  


సిటీలో స్వచ్చత యాప్
వీటన్నింటిని గుర్తించేందుకు,  స్వచ్ఛత పరిరక్షణలో  ప్రజలను భాగస్వాములను చేసేందుకు బల్దియా సరికొత్త మొబైల్ యాప్ ను  అందుబాటులోకి తీసుకురానుంది.  సిటీలో ఎక్కడైనా స్వచ్ఛ నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తిస్తే  నేరుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేలా అప్లికేషన్ ను రూపొందిస్తున్నారు.సిటీలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో  చెత్త పడేస్తున్నారు. నాలాల్లోకి వ్యర్ధాలను  పారబోస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు  నాలాల్లో  పేరుకుపోయి మురికి నీరు ప్రవాహం నిలిచిపోతుంది.  వర్షాలు కురిసినప్పుడు   లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.  ఇంటింటికి చెత్త సేకరిస్తున్నప్పటికీ  చాలామంది  బహిరంగ ప్రదేశాల్లో  చెత్తను వేస్తున్నారు.  ఇలాంటి ఘటనలు  పౌరులు గుర్తించినప్పుడు బల్దియా దృష్టికి సులభంగా తీసుకొచ్చేలా  యాప్  సిద్ధమవుతోంది.  విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్  ఆధ్వర్యంలో మొబైల్ యాప్  రూపొందిస్తున్నారు.  త్వరలోనే ఈ యాప్ ను  విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను  అధికారులు గోప్యంగా ఉంచుతారు.  నిబంధనలు ఉల్లంఘించే వారిపై  కఠినంగా వ్యవహరిస్తారు.  యాప్ లో  ఫిర్యాదు అందిన వెంటనే  క్షేత్ర స్థాయి అధికారులకు వాటిని ఫార్వార్డ్ చేస్తారు.  జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది సంబంధిత వ్యక్తులకు జరిమానా విధిస్తారు.  ఈ విధంగా  సిటీ స్వచ్ఛతలో  పౌరులు అంతా భాగస్వాములు  అయ్యే అవకాశం కలగనుంది.  కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు  రెగ్యులర్ గా చెత్తను వేస్తుంటారు.  రిపీట్ గా  నిబంధనలు ఉల్లంఘించే  వారిపై  మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.   చెత్త పడేస్తున్నప్పుడు  ఆ ఫోటో ను తీసి  యాప్ లో అప్ లోడ్ చేస్తే  ఆ ప్రాంతంలో  జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బంది  నిఘా పెంచుతారు.

No comments:

Post a Comment