ఇప్పుడు ప్రతిదీ యాప్స్‌మీదనే నడుస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచీ స్విగ్గీలో బ్రేక్‌ఫాస్ట్ కోసం మొదలై రాత్రుళ్లు మనల్ని చక్కగా నిద్రపుచ్చుతాయి కూడా. ఇలా మనం రకరకాల యాప్స్‌ను వాడుతుంటాం. ఫ్యాషన్‌కి సంబంధించినవి బోలెడన్ని. మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటాం, మేకప్ ఎలా వేసుకోవాలి, సందర్భానికి అనుకూలంగా ఎలా రెడీ అవ్వాలో కూడా చెప్పేస్తున్నాయి యాప్స్. అందంగా కనిపించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాలేజీ, ఆఫీస్, పార్టీలు, ఈవెంట్స్, సెమినార్లు, మీటింగ్ ఇంటర్వ్యూలని ఇలా వేర్వేరు సందర్భాల్లో మేకప్‌నుఎలా వేసుకుంటే బాగుంటుందో వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
యు క్యామ్ మేకప్
కొత్తగా మేకప్ వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది తమకు నప్పుతుందా లేదా అనే సంశయం ఉంటుంది చాలా మందికి. తీరా అలంకరణ అయ్యాక బాగోలేకుంటే ఇబ్బంది పడతారు. టైం వేస్ట్ కూడా. అలాంటివారికోసమే ఈ యాప్. మేకప్ వేసుకుని ఫొటో తీసుకుంటే చాలు. ఎలా ఉంటుందో ఈ యాప్ చెప్పేస్తుంది. ఇది ఫేషియల్ డిటెక్షన్ ద్వారా ముఖానికి ఏ రకమైన మేకప్ ఎలా ఉంటుందో సూచిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమలు వంటివాటి ఆధారంగా చర్మం ఆరోగ్యస్థితిని వివరిస్తుంది. కళ్లు పెదాలు, ఐబ్రోస్‌లకు సంబందించిన మేకప్‌కు ప్రత్యేక టూల్స్ ఉన్నాయి.
మేకప్ కోసం యాప్స్...
మేకప్ ప్లస్
మన ముఖానికి ఎటువంటి మేకప్ బాగుంటుందో తెలిపే యాప్ ఇది. మేకప్ వేసుకోవడం అయ్యాక మీరెలా ఉంటారో ఇది ఏఆర్ కెమెరా టెక్నిక్ ను వాడుకుని సూచిస్తుంది. ప్రత్యేక టూల్స్ ద్వారా రియల్ టైమ్ మేకప్‌ను అనుభవించవచ్చు. లిప్‌స్టిక్, ఐలాష్, బ్లష్, హెయిర్ కలర్‌లను మార్చుకుంటే ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు. వర్చువల్ కాంటాక్ట్ లెన్స్ ద్వారా కళ్ల రంగును కూడా మార్చుకోవచ్చు.
పర్ఫెక్ట్ 365
ముఖం, జుట్టుకు సంబంధించి రకరకాల స్టైల్స్ ఎలా ఉంటాయో చెప్పేది ఈ యాప్. సౌందర్యనిపుణులు తయారుచేసిన 20కి పైగా పర్సనల్ మేకప్ టూల్స్ ఇందులో ఉన్నాయి. ఫేస్‌కి ఎలాంటి మేకప్ సూటవుతుందో అవగాహన కల్పించే ట్యుటోరియల్స్ కూడా ఇందులో లభ్యం. బ్యూటీ, ఫ్యాషన్ టిప్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తుంది.
మేరీ కే మొబైల్
సెల్ఫీ దిగి ఫొటో అప్‌లోడ్ చేయాలి. దీంతో మీరు ఏ తరహా మేకప్, హెయిర్ స్టైల్ తో ఎలా కనిపిస్తారో క్షణాల్లో చూపిస్తుంది. ఫేస్, నెయిల్స్, హెయిర్, యాక్సెసరీస్ లో డిఫరెంట్ స్టైల్స్‌ను ట్రై చేసి, మీకు నప్పేది ఎంచుకోవచ్చు. విభిన్న హెయిర్ కలర్స్, లిప్ కలర్స్, ఐ మేకప్‌లను సరిచూసుకోవచ్చు. దీని ద్వారా ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు కూడా.
లోరియల్ మేకప్ జీనియస్
బ్యూటీ ప్రొడక్ట్‌లో టాప్ బ్రాండ్ లోరియల్ సంస్థ రూపొందించిన యాప్ ఇది. దీంట్లో కూడా సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్ చేయాలి. ముఖానికి సంబంధించిన 64 అంశాలను పరిగణనలోకి తీసుకుని లిప్‌స్టిక్, ఐషాడో, ఫౌండేషన్, బ్లష్, లైనర్ వంటివి ఏవి సరిపోతాయో సరిగ్గా సూచిస్తుంది. ఒక వేళ మనకు ఆ మేకప్ నప్పకపోతే కచ్చితంగా చెప్పేస్తుందీ యాప్. సో.. బాగున్నామా? లేదా? అంటూ ఇతరులను ఇబ్బంది పెట్టనవసరం లేకుండా ఈ యాప్స్ అన్నీ మహిళలకు చక్కగా ఉపయోగపడతాయి.
No comments:
Post a Comment