Breaking News

04/06/2019

రంజాన్ కు అంతా సిద్ధం


హైద్రాబాద్, జూన్ 4 (way2newstv.in)
ముస్లింలు సోదరులు రంజాన్ ఉపవాసాలు పలు దేశాల్లో మంగళవారంతో ముగియనున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఇవి సోమవారమే ముగిశాయి. అక్కడ సోమవారమే నెలవంక కనిపించినట్టు సౌదీలోని మక్కా మసీదు ఇమామ్ ప్రకటించారు. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, కువైట్, ఒమన్, ఖతర్, ఇరాన్, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లో మంగళవారమే ఈద్ జరుపుకుంటున్నారు. అయితే, ఇండోనేషియా, జపాన్, మలేషియా, థాయిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలు రంజాన్ మాసం మంగళవారమే ముగుస్తుందని, బుధవారం ఈదుల్ ఫితర్ జరుపుకోవాలని ప్రకటించాయి. తమ మంత్రిత్వ శాఖ రూపొందించిన చంద్రమాన క్యాలెండర్ ప్రకారం పాక్‌లో బుధవారమే ఈద్ జరుపుకోవాలని ఆ దేశ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ ఛౌదురీ తెలిపారు. 


రంజాన్ కు అంతా సిద్ధం
ఇక, బ్యాంకాంక్‌లోని యూఏఈ రాయబార కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారంతోనే రంజాన్ ముగుస్తుందని, బుధవారం ఈద్ జరుపుకోవాలని థాయిలాండ్ ఇస్లామిక్ కేంద్రం ప్రకటించినట్టు తెలిపింది. సౌదీలో నెలవంక కనిపించినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఈద్‌ను మంగళవారం జరుపుకుంటున్నారు. మరోవైపు, ఈదుల్ ఫితర్ జరుపుకునే రోజుపై గందరగోళం నెలకుంటుంది. వివిధ దేశాల్లో నెలవంక కనిపించడంపై ఇది ఆధారపడి ఉంటుంది. చంద్రమానం ప్రకారం ముస్లింల క్యాలెండర్‌ హిజ్రీ నెల ప్రారంభమవుతుంది. ఈ ఏడాది భారత్‌లోనూ రంజాన్ నెల ప్రారంభం కూడా వేర్వేరుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో నెలవంక దర్శనం ఇవ్వకపోవడంతో ముందు వెనుక ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. గతంలోనూ ఈద్ వేడుకలను వేర్వేరు రోజుల్లో జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది భారత్‌లో ఈద్ వేడుకలపై ఎలాంటి స్పష్టత రాలేదు. మంగళవారం నెలవంక దర్శనమిస్తే బుధవారమే ఈద్ జరుపుకునే అవకాశం ఉంది. అయితే, దక్షిణ భారత్‌లోని కేరళ, కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో జూన్ 5నే ఈదుల్ ఫితర్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఒక్క రోజు ముందుగానే రంజాన్ నెల ప్రారంభించారు.

No comments:

Post a Comment