Breaking News

08/06/2019

నకిలీలకు తెర తీశారు


వరంగల్, జూన్ 8, (way2newstv.in)
ఖరీఫ్ సీజన్‌లో పత్తి రైతులను టార్గెట్ చేస్తూ అనుమతులు లేని, నాసిరకం విత్తనాలను అంటగడుతూ రైతులను నిట్టనిలువునా మోసం చేస్తున్నట్లు దాకాలాలు కోకోల్లలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొందరు వ్యాపారులు ఖరీఫ్ సీజన్‌కు ముందు దుకాణాలను ప్రారంభించి సీజన్ ముగిసిన వెంటనే దుకాణాలను మూసివేస్తుంటారు. ఇలా సీజన్‌లో వెలిసిన దుకాణాల్లో రోజూ లక్షల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకు వేస్తూ అనుమతులు లేని విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా రైతన్నలకు అంటగడుతూ అక్రమ సంపాదనకు తెరలేపుతారు. ఈ వ్యవహరం ప్రధానంగా భూత్పూర్,జడ్చర్ల,రాణిపేట,కల్వకుర్తి ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహిస్తుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు తాళ్లాలకే పరిమితమైన సీడ్ దుకాణాలను వ్యాపారులు కొద్దిరోజుల క్రితం వాటిని పునప్రారంభించి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక పేరోందిన కంపెనీలు కాకుండా చిన్నచిన్న కంపెనీల వ్యాపారులు తమ దుకాణాల్లో వారి కంపెనీ బ్రాండ్ పేరుతో తయారు చేసిన విత్తనాలను రైతన్నలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


నకిలీలకు తెర తీశారు

ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోట్లల్లో చీకటి వ్యాపారం నడుస్తున్నట్లు వ్యవసాయాధికారులు మాత్ర తమకు పట్టన్నట్లు వ్యవహరిస్తుండడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మొదట దుకాణాలను ప్రారంభించి వాటిన ముపుగుల్లో అక్రమ విత్తన వ్యాపారానికి తెరదించి రైతులను నట్టేట ముంచుతున్న దాకాలాలు ఉన్నాయి.ఇందుకు ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌ను టార్గెట్‌గా చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా పోలిసులు,వ్యవసాయశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి రావడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు భూత్పూర్,అమిస్తాపూర్ ప్రాంతాల్లో పోలిసులు,వ్యవసాయశాఖ అధికారులు కొద్దిరోజుల క్రితం నిర్వహించిన దాడుల్లో ఓ కంపెనీ యాజమాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే రూ.కోట్ల రూపాయలు విలువ చేసే విత్తనాలను అక్రమంగా నిల్వ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.దీంతో సదరు కంపెనీకి సంబంధించిన రూ. 1.52కోట్లు విలువ చేసే విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితో కొద్దిరోజుల్లో కోట్లకు పడగలు ఎత్తవచ్చనే అత్యశతో కొందరు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండానే కోట్లలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొందరు అక్రమార్కులు గుట్టుగా అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఇటు అధికారులకు, అటు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. అక్రమార్కులు చేస్తున్న అక్రమాలను పసిగట్టని రైతన్నలు నిట్టనిలువునా మోసపోతున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పత్తి విత్తనాల వ్యాపారాలకు వ్యవసాయశాఖ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్ల సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తి విత్తన కంపెనీల్లో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తూ విత్తన కంపెనీలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గతంలో ఇదే మాదిరి ఆరోపణలు వెలువెత్తడంతో భూత్పూర్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో గుణపాఠం నేర్వని అధికారులు తిరిగి అదే దారిలో వెలుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీలు,దుకాణాలకు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిపై నిఘా ఉంచడంతోపాటు ప్రత్యేక విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment