Breaking News

05/06/2019

పర్యావరణ పరిరక్షణ అందరి బాద్యత


ఒంగోలు, జున్ 5,(way2newstv.in):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని ప్రిన్సిపుల్ సీనియర్ సివిల్ జడ్జి పి.శోభాకుమారి పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండల ప్రాంతీమ కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరజనలో ప్రపంచ పర్యావరజన దినోత్సవంతో భాగంగా పర్యావరణ పరిరక్షణ పై ఏర్పాటు చేసిన గ్రీన్ ర్యాలీని ప్రన్సిపుల్ సీనియర్ సివిల్ జడ్డి జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపుల్ సీనియర్ సివిల్ జడ్డి మాట్లాడుతూ  లీగల్  సర్వీసెస్ అధారిటీ వారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అనుసంధానం చేసుకొని పర్యావరణ పరిరక్షణపై పలు కార్యక్రమాలు చేపట్టన్నట్లు తెలిపారు. ప్రజా చైతన్యంతోనే పర్యావరణ పరిరక్షణ కలుగుతుందన్నారు. ప్రధానంగా ప్రతి ఇంటి నుండి  ఈ కారయక్రమం ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. 


పర్యావరణ పరిరక్షణ అందరి బాద్యత
వాతావరణంలో చాలా ప్రమాదకర మార్పులు సంభవిస్తున్నాయని భావితరాలకు మంచి వాతావరణం అందించాలంటే విధిగా మొక్కలు నాటాల్సివుందన్నారు. వాయు, జల కాలుష్యాలతో పాటు  గాలి, శబ్ద కాలుష్యాలు ఎక్కువ అవుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గాలి కాలుష్యాన్ని తగ్గించాలని అందుకు అనుగుణంగా నివారణ చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జి.నాగిరెడ్డి మాట్లాడుతూ 1972 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి  మొదటిసారిగా పర్యావరణానికి  సంబంధించిన సదస్సును స్టాక్ హోమ్ లో నిర్వహించినదన్నారు. ఐక్యరాజ్య సమితి  పర్యావరణ పధకం ప్రతి సంవత్సరం ఒక అంశంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని బలపరుస్తుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019 ను చైనా గాలికాలుష్యాన్ని నివారిద్దాం అనే అంశంతో ఆ సంవత్సరంనిర్వహిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు దోహదపడతాయన్నారు. కాలుష్య నియంత్రణపై కళాజాత బృందాల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొనిరావడానికి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నామన్నారు. గ్రీన్ ర్యాలీ ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయం నుండి రీడింగ్ రూం, పప్పుబజార్ట్రంక్ రోడ్డు మీదుగా తిరిగి నగరపాలక సంస్ధ కార్యాలయమునకు చేరుకుంది. ర్యాలఅ లో పెద్ద ఎత్తున నర్సింగ్ కళాశాల, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఇంజనీర్ కె.సుధ, సిబ్బంది, నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment