Breaking News

28/06/2019

ఆ గ్రహాల శకలాలు పడితే...కోటీశ్వరులే


న్యూఢిల్లీ, జూన్ 28  (way2newstv.in)
అదేంటీ గ్రహశకలం భూమిని తాకితే ప్రమాదం కదా? ప్రజలు కోటీశ్వరులు కావడానికి.. గ్రహ శకలానికి సంబంధం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నారా? గ్రహ శకలం భూమికి ప్రమాదకరమే.. కానీ, ఈ గ్రహశకలం ఎక్కడ పడితే అక్కడ లక్ష్మీ దేవి కటాక్షిస్తుంది. ఎందుకంటే.. ఇది బంగార గనులతో నిండిన అరుదైన గ్రహ శకలం. నమ్మకం కలగడం లేదా? అయితే.. నాసా జరిపిన ఈ అధ్యయనం గురించి తెలుసుకోండి. ఈ సొమ్ముతో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావచ్చు. ప్రతి దేశం అప్పులు లేకుండా అభివృద్ధి చెందవచ్చు. కొన్ని తరాలు కుర్చుని తినేంత సొమ్ము ప్రపంచంలో ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను కలిపితే ఉండే ఆర్థిక విలువ 59.9 ట్రిలియన్ పాండ్‌లు. 

ఆ గ్రహాల శకలాలు పడితే...కోటీశ్వరులే

అదే ఈ గ్రహశకలం భూమి మీదకు వచ్చినట్లయితే కొన్ని లక్షల శాతం సంపద ఏర్పడుతుంది. అలాగని, అది భూమిని ఢీకొట్టాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి. గ్రహశకలం భూమిని తాకితే ప్రాణ నష్టంగా భారీగా ఉంటుంది. సంపద కోసం ఆశపడితే ప్రాణాలే పోతాయి. అయితే, దీని గురించి మీరు అస్సలు ఆందోళన చెందవద్దు. ఎందుకంటే.. అది భూమి కొన్ని వేల మైళ్ల దూరంలో ఉంది. అంగారకుడు, బృహస్పతి గ్రహాలకు సమీపంలో ఈ గ్రహ శకలం స్థిరంగా కదులుతోంది. ఈ గ్రహశకలం పొడవు సుమారు 140 మైళ్లు ఉండవచ్చని నాసా అంచనా వేసింది. ఇంకో శుభవార్త ఏమిటంటే.. ఆ శకలం భూమిని తాకడానికి ముందే నాసా అక్కడికి అంతరిక్ష వాహనాలను పంపనుంది. 2022 ఆగస్టు నెలలో అవి ఆ శకలంపైకి చేరుకుంటాయి. 2026 సంవత్సరంలో ఉల్టిస్పెక్ట్రల్ ఇమేజర్, గామా రే, న్యూట్రాన్ స్పెట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్‌ల సాయంతో పూర్తి స్థాయిలో గ్రహాన్ని జల్లెడపడతారు. సౌర వ్యవస్థలో గ్రహాలు ఒకదాన్ని ఒకటి ఢీకొనడం వల్ల ఈ గ్రహశకలం ఏర్పడి ఉంటుందని నాసా తెలిపింది. దీన్ని పరిశీలిస్తే భూమి ఆవిర్భావంపై మరిన్ని లోతైన విషయాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. గ్రహంలోని గనులతో సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఆ గ్రహంపై ఎలాంటి సంపద ఉందో ఖచ్చితంగా అంచనా వేయడానికి మాత్రమే తమ పరిశోధనలని చెప్పింది. అయితే, యూకేకు చెందిన ఆస్ట్రోయిడ్ మైనింగ్ కార్పొరేషన్ అధినేత మిట్చ్ హంటర్ స్కులియన్ మాట్లాడుతూ.. 2030 కల్లా తాము అంతరిక్షంలో మైనింగ్ పనులు చేపడతామని తెలిపారు. 

No comments:

Post a Comment